అక్షరటుడే, వెబ్‌డెస్క్: NEET Exam Pressure | వైద్య విద్య ప్రవేశ పరీక్ష (NEET)కు కొన్ని గంటల ముందు ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో విషాదాన్ని నింపింది. మియాపూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు, కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం.. బాధితురాలు ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాకు చెందిన విద్యార్థిని. NEET కు సిద్ధమవుతున్న ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది.
NEET Exam Pressure | కుటుంబీకుల అంచనాలను అందుకోలేకపోతున్నానని..
కుటుంబ సభ్యుల అంచనాలను అందుకోలేకపోతున్నాననే ఆవేదనతో పాటు, పరీక్షల ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నట్లు పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థిని మృతికి గల పూర్తి కారణాలపై విచారణ కొనసాగుతోంది.
ఇటీవలి కాలంలో పోటీ పరీక్షల ఒత్తిడి, భవిష్యత్తుపై ఆందోళనల కారణంగా విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి పెరుగుతోందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై తల్లిదండ్రులు, విద్యాసంస్థలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
Kerala fake study certificates | “డిగ్రీల దుకాణం”: చదివినవాడు నిరుద్యోగి… ముద్రించేవాడు నిపుణుడు!