Illegal Water Motors | నల్లాలకు మోటార్లు పెట్టిన వారిపై చర్యలు

నల్లాలకు అక్రమంగా మోటార్లు పెడుతున్న వారిపై జలమండలి అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Illegal Water Motors | నల్లాలకు అక్రమంగా మోటార్లు పెడుతున్న వారిపై జలమండలి (HMWSSB) అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు. మోటార్లు సీజ్​ చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నారు.

జలమండలి నీటి సరఫరా పైపులైన్​లకు అక్రమంగా మోటార్లు అమర్చి నీటిని తోడుతున్న వారిపై అధికారులు, విజిలెన్స్ అధికారులు చర్యలు చేపట్టారు. బోడుప్పల్‌ సర్కిల్‌ పరిధిలోని బోడుప్పల్‌ వార్డులో ఈస్ట్‌ హనుమాన్‌నగర్‌, హుడా లక్ష్మీనగర్‌ ప్రాంతాల్లో అధికారులు, విజిలెన్స్‌ బృందం సమన్వయంతో అక్రమ మోటార్లను అధికారులు తొలగించారు.

Illegal Water Motors | 9 మోటార్లు స్వాధీనం

ఈ తనిఖీల్లో 9 అక్రమ మోటార్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నీటి సరఫరా సమయంలో పైపులైన్లకు మోటార్లు అమర్చి నీటిని తోడటం వల్ల ఇతర వినియోగదారులకు తగినంత నీరు అందకపోవడంతో పాటు సరఫరా వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుందని జలమండలి తెలిపింది. అక్రమంగా మోటార్లు వినియోగించే వారిపై తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

దీనిని కూడా చదవండి : Cannabis Seizure | ఎయిర్​పోర్టులో భారీగా గంజాయి పట్టివేత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *