అక్షరటుడే, వెబ్డెస్క్ : Mee Seva Certificates | ప్రజలు మీ సేవ కేంద్రాల నుంచి వివిధ రకాల సర్టిఫికెట్లు తీసుకుంటారు. బర్త్, డెత్ సర్టిఫికెట్లతో పాటు ఇన్కమ్, క్యాస్ట్ లాంటి పత్రాలను ఎక్కువగా తీసుకుంటారు. ఇంట్లో అక్కడ ఇక్కడ పెట్టే సమయంలో అవి చిరిగి పోతుంటాయి. దీంతో ప్రజలు ముఖ్యమైన సర్టిఫికెట్లు చినిగి పోకుండా లామినేషన్ చేయిస్తారు. అయితే ఇక ఆ సమస్య ఉండదు. ఈ మేరకు చిరిగిపోకుండా ఉన్న సర్టిఫికెట్లను ప్రభుత్వం తీసుకొచ్చింది.
ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికెట్ల భద్రత, మన్నిక ఎక్కువకాలం ఉండే విధంగా మంత్రి శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) హైదరాబాద్లోని బేగంపేటలో గల ప్రజా భవన్లో ఆధునిక, చిరగని, భద్రపరిచే బేస్ మీసేవా స్టేషనరీని ప్రారంభించారు. ప్రత్యేకంగా రూపొందించిన, చిరగని, వాటర్ ప్రూఫ్ కాగితాన్ని ఆయన ఆవిష్కరించారు. దీనిపై మీ సేవ సర్టిఫికెట్లు ప్రింట్ చేసి ఇస్తారు. దీంతో అవి చిరిగి పోవని ఆయన తెలిపారు. ఇందులో 15 అధునాతన భద్రతా ఫీచర్లు పొందుపరిచినట్లు చెప్పారు. ఈ సర్టిఫికెట్లకు లామినేషన్ చేయాల్సినన అవసరం లేదు.
Mee Seva Certificates | ఎక్కువ కాలం పాటు..
మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం జారీ చేసిన సర్టిఫికెట్లు, విలువైన పత్రాలని ప్రజలు తమ జీవితాంతం దాచుకుంటారని చెప్పారు. అందువల్ల వాటి భద్రత, ప్రామాణికత, మన్నికను నిర్ధారించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. దీంతో ప్రభుత్వం తాజాగా కొత్త సర్టిఫికెట్లను ప్రవేశ పెట్టిందన్నారు. ఇవి ప్రజలు తమ ముఖ్యమైన పత్రాలను ఎక్కువ కాలం పాటు భద్రపరచుకోవడానికి సహాయ పడుతుందని తెలిపారు. ప్రజల సౌకర్యాన్ని పెంచే, పత్రాల భద్రతను పటిష్టం చేసే, ప్రభుత్వ సేవల మొత్తం నాణ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
దీనిని కూడా చదవండి : Food Safety | హైవేల పక్కన హోటళ్లలో తింటున్నారా.. అయితే జాగ్రత్త!