అక్షరటుడే, వెబ్డెస్క్ : Food Safety | దూర ప్రయాణం చేసే సమయంలో హైవేల పక్కన ఉన్న హోటళ్లు, దాబాల్లో చాలా మంది భోజనం చేస్తారు. పెద్ద పెద్ద హోటళ్లలో డబ్బులు బాగా ఖర్చు చేసి మరి తింటారు. అయితే చాలా హోటళ్లలో అధ్వాన పరిస్థితులు చూస్తే మాత్రం షాక్ కావాల్సిందే. కుళ్లిన కూరగాయాలు, పాడైన ఆహార పదార్థాలతో వంటలు చేస్తున్నారు.
టీజీ సేఫ్ అధికారులు ఆహార భద్రత విషయంలో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నిబంధనలు పాటించని హోటళ్లు, దాబాల లైసెన్స్లు రద్దు చేస్తున్నారు. ఇటీవల నిజామాబాద్ (Nizamabad), కామారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో ఎన్హెచ్–44 పక్కన ఉన్న హోటళ్లలో తనిఖీలు చేసి పలు హోటళ్లు, దాబాల లైసెన్స్లు రద్దు చేశారు. తాజాగా హైదరాబాద్-విజయవాడ హైవే హోటళ్లపై మంగళవారం సోదాలు చేశారు. పలు హోటళ్లలో ఆహార భద్రత, పరిశుభ్రత ఉల్లంఘనలు గుర్తించారు.
Food Safety | పురుగుల పట్టిన పప్పు.. కుళ్లిన కూరగాయలు
ఈ తనిఖీలలో కొయ్యలగూడెం, కోడాడు మధ్య రహదారిపై ఉన్న హోటళ్లను సందర్శించారు. ఆహార నిల్వ ప్రదేశాలలో బొద్దింకలు, ఎలుకలు కనిపించగా, అపరిశుభ్రమైన వంటశాలలలో ఆహారాన్ని తయారు చేస్తున్నారు. పప్పుధాన్యాలు, ఇతర ముడి పదార్థాలలో పురుగులు ఉన్నట్లు గుర్తించారు. కుళ్లిన, పాడైన కూరగాయలతో వంట చేస్తున్నారు. అవసరమైన ప్రమాణాలకు అనుగుణంగా లేని ఉష్ణోగ్రతలలో మాంసం, పాల ఉత్పత్తులను నిల్వ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని హోటళ్లలో ముందు రోజు వండిన ఆహారాన్ని నిల్వ ఉంచారు. ఉల్లంఘనలకు పాల్పడితే సంస్థలను మూసివేయడం, షో-కాజ్ నోటీసులు, మెరుగుదల నోటీసులు జారీ చేయవచ్చని ఎన్ఫోర్స్మెంట్ విభాగం తెలిపింది.
ఇది కూడా చదవండి..: Singareni Workers Bonus | సింగరేణి కార్మికులకు గుడ్న్యూస్.. రూ.1.53 లక్షల బోనస్