Singareni Workers Bonus | సింగరేణి కార్మికులకు గుడ్​న్యూస్​.. రూ.1.53 లక్షల బోనస్

సింగరేణి కార్మికులకు రూ.1.53 లక్షల చొప్పున బోనస్​ ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Singareni Workers Bonus | సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. దసరా సందర్భంగా బోనస్​ను ప్రకటించింది. సంస్థ లాభాల్లో 34 శాతం దసరా బోనస్‌గా ఇస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఒక్కో కార్మికుడికి రూ.1.53 లక్షలు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.5,500 బోనస్ ఇస్తామన్నారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) మంగళవారం మీడియాతో మాట్లాడారు. శాశ్వత ఉద్యోగులకు లాభాల్లో 34 శాతం బోనస్​ రూపంలో చెల్లిస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న 250–300 డిపెండెంట్ ఆర్డర్లను 15 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. సింగరేణి కార్మికుల మారుపేర్ల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి భూముల్లో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామన్నారు. కలెక్టర్లు, సింగరేణి అధికారుల కమిటీ నెల రోజుల్లో అర్హుల జాబితా సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు.

Singareni Workers Bonus | నెహ్రూ హౌసింగ్​ కాలనీ ఏర్పాటు

సింగరేణి భూముల్లో కార్మికుల ఇళ్ల నిర్మాణాల కోసం నెహ్రూ హౌసింగ్ కాలనీలను ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. శిథిలమైన క్వార్టర్ల స్థానంలో కొత్తవి నిర్మిస్తామని పేర్కొన్నారు. సింగరేణి ఏరియా ఆస్పత్రులను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయాలని ఆదేశించారు. సింగరేణి ప్రాంతంలోని గ్రామాల్లో ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. వినియోగంలో లేని భూములు, ఓబీ గుట్టలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. ప్రతి ఆరు నెలలకు కార్మికులకు భద్రతా కిట్ల పంపిణీ చేయాలని సూచించారు.

Singareni Workers Bonus | రామగుండంలో థర్మల్ విద్యుత్​ కేంద్రం

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రామగుండంలో సింగరేణి ఆధ్వర్యంలో థర్మల్ విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. కార్మికుల ఆదాయపన్నును సంస్థ నుంచే ప్రభుత్వానికి చెల్లించేలా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. సత్తుపల్లి, భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలల మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయిస్తామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: Harish Rao | ఉచిత విద్యుత్​కు ఎసరు పెట్టే కుట్ర : హరీశ్​రావు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *