Rajanna Sircilla Leprosy Detection | కుష్టు వ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి చికిత్స అందించాలి..

కుష్టువ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి చికిత్స అందించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Rajanna Sircilla Leprosy Detection | కుష్టువ్యాధి లక్షణాలను ముందుగానే గుర్తించి చికిత్స అందించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ ఏంజెలా ఆల్ఫ్రెడ్ అన్నారు. తంగల్లపల్లి మండలంలో కుష్టు వ్యాధి (Leprosy Detection) కేసుల గుర్తింపు కోసం నిర్వహిస్తున్న ఎల్‌సీడీసీ (LCDC – Leprosy Case Detection Campaign) ఇంటింటి సర్వేను తనిఖీ చేశారు.

Rajanna Sircilla Leprosy Detection | ప్రారంభదశలోనే గుర్తిస్తే..

ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. కుష్టు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి, తగిన చికిత్స అందించడం ద్వారా వ్యాధి కారణంగా కలిగే అంగవైకల్యాన్ని నివారించవచ్చని ఏంజెలా ఆల్ఫ్రెడ్ తెలిపారు. ప్రజల్లో కుష్టు వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తూ, వ్యాధి లక్షణాలు ఉన్నవారిని గుర్తించడంలో ఆశా కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. కుష్టువ్యాధి మైకోబాక్టీరియం లెప్రే అనే బ్యాక్టీరియా వల్ల వస్తుందని తెలిపారు. ఈ వ్యాధి లక్షణాలు బయటపడటానికి సాధారణంగా మూడు నుంచి ఐదేళ్లు పట్టవచ్చని వివరించారు. కుష్టు వ్యాధి వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి కాదని, అది శాపం లేదా పాపం వల్ల వచ్చే వ్యాధి కాదని స్పష్టం చేశారు. బహుళ ఔషధ చికిత్స (MDT) ద్వారా కుష్టు వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని, వ్యాధి రకాన్ని బట్టి సాధారణంగా ఆరు నుంచి పన్నెండు నెలల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.

Rajanna Sircilla Leprosy Detection | ప్రతిఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించాలి..

ఆశా కార్యకర్తలు ఇంటింటి సందర్శన సమయంలో కుటుంబంలోని ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా పరిశీలించాలని, చర్మంపై స్పర్శ జ్ఞానం లేని మచ్చలు లేదా రాగి వర్ణంలో కనిపించే మచ్చలు ఉన్న వ్యక్తులను గుర్తించాలని డీఎంహెచ్​వో తెలిపారు. అటువంటి వ్యక్తులను సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్యాధికారి ద్వారా పరీక్షలు చేయించి, వ్యాధి నిర్ధారణ జరిగేలా చూడాలని సూచించారు. కుష్టు వ్యాధి నిర్ధారణ అయిన వారికి వైద్యుల సూచనల మేరకు పూర్తి కాలం చికిత్స అందేలా ఆశా కార్యకర్తలు ప్రోత్సహించాలని, చికిత్స మధ్యలో నిలిపివేయకుండా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ మాస్ మీడియా ఆఫీసర్ ప్రసాద్, డీపీఎంవో దేవ్​ సింగ్, హెల్త్ అసిస్టెంట్లు మహేష్, సతీష్, ఏఎన్​ఎం ప్రమీల, ఆశ కార్యకర్తలు హఫీజా తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు.. విచారణలో కీలక విషయాలు! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *