Sircilla MSME Bank Loans | బ్యాంక్ రుణాలు వ్యాపారాభివృద్ధికి వినియోగించాలి..: కలెక్టర్ గరిమ అగ్రవాల్

బ్యాంక్ రుణాలు వ్యాపారాభివృద్ధికి వినియోగించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, రాజన్న సిరిసిల్ల: Sircilla MSME Bank Loans | బ్యాంక్ రుణాలు వ్యాపారాభివృద్ధికి వినియోగించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ (Collector Garima Agrawal) పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ సంవాద్ (MSME Bank Loans) పేరుతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్​లో శుక్రవారం నిర్వహించారు.

Sircilla MSME Bank Loans | సంస్థాగత రుణాలపై అవగాహన..

ఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ సంవాద్ కార్యక్రమం ద్వారా చేనేత, పవర్‌లూమ్ రంగాలకు చెందిన యజమానులు, ఆసాములు, కార్మికులకు సంస్థాగత రుణాలపై కలెక్టర్​ అవగాహన కల్పించారు. బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహించడం, ఉత్పత్తులకు విలువ ఆధారిత ప్రక్రియలను జోడించడం ద్వారా ఆదాయం, ఉపాధి అవకాశాలను పెంపొందించుకోవాలన్నారు. ఆర్థికంగా ఎదిగి మిగతా వారికి ఆదర్శంగా నిలవాలని ఆకాక్షించారు. చేనేత పవర్‌లూమ్‌ల ద్వారా ఉత్పత్తి చేస్తున్న వస్త్రాలకు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా మరింత నాణ్యమైన, ఆకర్షణీయమైన ఉత్పత్తులను తయారు చేయాలని సూచించారు. దీంతో ఉత్పత్తులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడంతో పాటు, వీవర్లు, యూనిట్ యజమానులు అధిక ఆదాయం పొందేందుకు, ఉపాధి అవకాశాలను పెంపొందించుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మార్కెట్​తో పోటీ పడాలని, ప్రభుత్వ ఆర్డర్లతో ప్రైవేట్ ఆర్డర్లు తయారు చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చేనేత వస్త్రాల తయారీ వైపు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రతినిధులు మార్పు చెందాలని, సిరిసిల్ల ఖ్యాతిని మరింత చాటాలని పేర్కొన్నారు.

Sircilla MSME Bank Loans | బ్యాంకుల ద్వారా లభించే రుణ సదుపాయం..

ఆర్బీఐ ఎల్డీవో శ్రీచేతన్ సంస్థాగత రుణాల ప్రాధాన్యత, బ్యాంకుల ద్వారా లభించే రుణ సదుపాయాలు, ఆర్థిక క్రమశిక్షణ, రుణాల సక్రమ వినియోగంపై అవగాహన కల్పించారు. వీవర్లు వివిధ మార్గాల్లో రుణాలు తీసుకోవడం వల్ల ఎదురవుతున్న ఆర్థిక సమస్యలను వివరించి, అనధికారిక రుణాలపై ఆధారపడకుండా బ్యాంకులను సంప్రదించి, తమ అవసరాలకు అనుగుణంగా తగిన రుణ సదుపాయాలను పొందాలని సూచించారు. కార్యక్రమంలో నాబార్డ్ డీడీఎం దిలీప్ చంద్ర, ఎల్​డీఎం రాజీవ్ కుమార్, ఇండస్ట్రీస్ జీఎం హనుమంతు, హ్యాండ్ లూమ్స్ అండ్ టెక్స్​టైల్స్​ ఏడీ సంతోష్ కుమార్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, చేనేత, పవర్‌లూమ్ యూనిట్ యజమానులు, వీవర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: పాత రోజులు మళ్లీ తెచ్చారు…జనరేటర్లు రెడీ చేస్తున్న రైతులు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *