El Nino Crisis | వ్యవసాయానికి నీళ్లు ఇవ్వడం కుదరదు : సీఎం రేవంత్ రెడ్డి

యాసంగిలో వ్యవసాయానికి నీళ్లు ఇవ్వడం కుదరదని సీఎం రేవంత్​రెడ్డి స్పష్టం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : El Nino Crisis | రాష్ట్రంలో ఎల్​నినో ప్రభావం తీవ్రంగా ఉందని సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. వ్యవసాయానికి నీళ్లు ఇవ్వడం కుదరదని స్పష్టం చేశారు. కూరగాయలు, చిన్న సన్న ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు.

టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి కీలక సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్​ మహేష్‌ కుమార్‌ గౌడ్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరు అయ్యారు. ఎల్‌నినో, ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ నేతలకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ.. కరువు ప్రారంభమైనప్పుడు నొప్పి తెలియదని, రోజులు గడిచే కొద్దీ దాని ప్రభావం కనిపిస్తుందని హెచ్చరించారు. కరువుపై కొందరు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

El Nino Crisis | బోర్లు వట్టిపోతున్నాయి

రాష్ట్రంలో ఇప్పటికే 50 శాతం బోర్లు డ్రై అయిపోయానని సీఎం తెలిపారు. యాసంగి వరినాట్లు నవంబర్ నుంచి ప్రారంభం అవుతాయని.. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, రానున్న రోజుల్లో తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందన్నారు. చుక్క నీరు కూడా దొరకదని హెచ్చరించారు. శ్రీశైలంలో, కృష్ణా పరివాహక ప్రాంతంలో 20 శాతం నీళ్లు కూడా లేవని ఆందోళన వ్యక్తం చేశారు. తాగునీరుకి వాడుకోవడం తప్ప మరే ఇతర అవసరాలకు నీళ్లు లేవని స్పష్టం చేశారు. 8 నుంచి 10 నెలల వరకు అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కోబోతున్నామి చెప్పారు.

El Nino Crisis | వారిని నమ్మి మోసపోవద్దు

కరువు ప్రారంభంలో చిన్నగా ఉన్నా, జులై నాటికి తీవ్రంగా ఉంటుందని సీఎం హెచ్చరించారు. సాగునీరు కాదు, తాగునీరు కూడా దొరకదన్నారు. కరోనా సమయంలో క్రోసిన్‌ వేసుకుంటే కరోనా పోతుందని కేసీఆర్‌ చెప్పారని సీఎం అన్నారు. కేసీఆర్‌ మాటలు నమ్మి కరోనా సమయంలో చాలా మంది చనిపోయారని ఆరోపించారు. ప్రస్తుతం హరీష్‌రావు మాటలు నమ్మి పంటలు వేస్తే రైతులు నష్టపోతారని తెలిపారు. ఆయనను నమ్మితే మట్టితో అంబలి చేసుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్​ ప్రజాప్రతినిధులు, నాయకులు కరువుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

దీనిని కూడా చదవండి : Bribery Case | రూ.7 వేల లంచం కేసు.. 17 ఏళ్ల తర్వాత జైలు శిక్ష

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *