Bribery Case | రూ.7 వేల లంచం కేసు.. 17 ఏళ్ల తర్వాత జైలు శిక్ష

లంచం తీసుకుంటూ దొరికిన ఓ అధికారికి ఎట్టకేలకు జైలు శిక్ష పడింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bribery Case | లంచం తీసుకుంటూ దొరికిన ఓ అధికారికి ఎట్టకేలకు జైలు శిక్ష పడింది. 17 ఏళ్ల తర్వాత కోర్టు అతడిని నేరస్తుడిగా గుర్తించి ఏడాది జైలు శిక్ష వేసింది.

మెదక్ (Medak) జిల్లా శంకరంపేట (ఎ)లోని సోషల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్‌లో వెల్ఫేర్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కంది నాగేశ్వర్‌ 2009లో రూ.7 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. దీంతో ఏసీబీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. గతంలో అరెస్ట్​ చేశారు. రిమాండ్​ అనంతరం ఆయన బయటకు వచ్చారు. ఈ కేసులో సాక్ష్యాధారాలను ఏసీబీ కోర్టు ముందు ప్రవేశ పెట్టింది. దీంతో హైదరాబాద్ ఏసీబీ (ACB) కోర్టు అతడిని దోషిగా తేల్చింది. కంది నాగేశ్వర్​కు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎండీ. అబ్దుల్ జావేద్ పాషా నిందితుడికి ఒక్కో సెక్షన్ కింద ఏడాది చొప్పున కఠిన కారాగార శిక్షను విధించారు. ఈ శిక్షలు ఏకకాలంలో అమలవుతాయి.

Bribery Case | ఏళ్లకు ఏళ్లు విచారణ

ఏసీబీ (ACB) అధికారులు నిత్యం దాడులు చేస్తున్నారు. ఎంతో మంది అవినీతి అధికారులు లంచాలు తీసుకుంటూ దొరుకుతున్నారు. ఏసీబీ దాడులు (ACB Raids) చేపడుతున్నా.. లంచాలు తీసుకునే అధికారులు మాత్రం మారడం లేదు. ఏసీబీ కేసుల్లో విచారణ వేగంగా జరగకపోవడంతోనే వారు రెచ్చిపోతున్నారు. చాలా కేసుల్లో ప్రాసిక్యూషన్​కు ఆయా శాఖలు అనుమతించడం లేదు. కేవలం శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. అదికూడా కొంతకాలం సస్పెండ్​ చేసి, మళ్లీ విధుల్లోకి తీసుకుంటున్నారు. దీంతో అవినీతి అధికారులు భయం లేకుండా లంచాలు తీసుకుంటున్నారు. లంచం తీసుకుంటూ రెడ్​ హ్యాండెడ్​గా దొరికిన వారిని శాశ్వతంగా ఉద్యోగంలో నుంచి తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

దీనిని కూడా చదవండి : KTR Rahul Gandhi Remarks | రాహుల్​ గాంధీకి ఎన్ని జాకీలు పెట్టిన లేస్తలేడు : కేటీఆర్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.