అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం లేదు. అన్ని శాఖల్లో తిష్ట వేసి ప్రజలను జలగల్లా పట్టి పీడిస్తున్నారు. ఏసీబీ దాడులు (ACB Raids) జరుగుతున్నా.. లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. కొందరైతే లంచం తీసుకోవడం కూడా తమ జాబ్లో భాగంగా భావిస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా లంచం తీసుకుంటూ ఓ సర్వేయర్ ఏసీబీ అధికారులకు చిక్కాడు.
జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా వడ్డేపల్లి మండల సర్వేయర్ కమ్మరి బ్రహ్మయ్య రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. మండలంలోని ఓ కుటుంబం తమ భూమిని సర్వే చేయాలని తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంది. భూమి సర్వే చేసినందుకు సర్వేయర్ రూ.15 వేల లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు.
ACB Trap | గతంలో రూ.5 వేలు
ఫిర్యాదిదారుని తల్లిదండ్రులకు చెందిన భూమిని సర్వే చేసినందుకు నిందితుడు బ్రహ్మయ్య మంగళవారం రూ.10 వేలు లంచం తీసుకున్నాడు. ఆ సమయంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కాగా నిందితుడు గతంలో రూ.5 వేల లంచం తీసుకున్నాడు. మహబూబ్‌నగర్ రేంజ్ యూనిట్ ఏసీబీకి అధికారులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

ACB Trap | లంచం అడిగితే ఫోన్ చేయండి
ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్ 9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్సైట్ ద్వారా కంప్లైట్ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.
ఇది కూడా చదవండి : New Pensions | జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు.. అర్హతలు, కావాల్సిన సర్టిఫికెట్లు ఇవే..


