New Pensions | జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు.. అర్హతలు, కావాల్సిన సర్టిఫికెట్లు ఇవే..

Srinivas Kolluri

అక్షరటుడే, ఎల్లారెడ్డి: New Pensions | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కొత్తగా సామాజిక పెన్షన్లు జారీ చేయాలని నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2) సందర్భంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు చేయÖత పెన్షన్లు అందించనుంది. గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డు కార్యాలయాలతోపాటు మీసేవ కేంద్రాల ద్వారానూ దరఖాస్తు చేసుకోవచ్చు.

చాలామంది గ్రామ పంచాయతీలలో దరఖాస్తులు సమర్పిస్తున్నారు. అయితే అర్హత పత్రాల విషయంలో కొంత గందరగోళం నెలకొనడంతో దరఖాస్తుదారులు ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో చేయÖత పెన్షన్ కోసం ఏ ఏ పత్రాలు కావాలో తెలుసుకుందామా..

New Pensions | ధ్రువీకరణ పత్రాలు..

అందరికీ కావలసిన సాధారణ పత్రాలు ఇవి.. దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు, వయసు ధ్రువీకరణ పత్రాలు, ఓటర్ ఐడీ కార్డ్ లేదా పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల సర్టిఫికెట్ (పదో తరగతి మెమో), బ్యాంక్ ఖాతా పుస్తకం జిరాక్స్‌లు అవసరం అవుతాయి. నివాస ధృవీకరణ(ఓటర్ కార్డ్ లేదా విద్యుత్ బిల్లు) ఉండాలి. దరఖాస్తుతోపాటు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో జతచేయాలి.

New Pensions

New Pensions | పెన్షన్ రకాన్ని బట్టి..

పెన్షన్ రకాన్ని బట్టి (వృద్ధాప్యం, వితంతువు, దివ్యాంగులు, గీత కార్మికులు మొదలైనవి) అదనపు ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. వృద్ధాప్య పెన్షన్ కోసం దరఖాస్తు చేసేవారికి కనీస వయసు 57 ఏళ్లు ఉండాలి. వయసు ధ్రువీకరణ పత్రం అవసరం.

వితంతు పెన్షన్ కోసం దరఖాస్తు చేసేవారు భర్త డెత్ సర్టిఫికెట్ సమర్పించాలి.

దివ్యాంగుల పెన్షన్‌కు కనీసం 40 శాతం వైకల్యం ఉన్నట్లు తెలిపే సదరం సర్టిఫికెట్ ఉండాలి.

నేత కార్మికులు చేనేత కార్మిక సంఘంలో రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం జతచేయాల్సి ఉంటుంది.

గీత కార్మికులకు గీత కార్మిక సహకార సంఘానికి సంబంధించిన సభ్యత్వ సర్టిఫికెట్ అవసరం.

ఒంటరి మహిళ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేవారు వివాహం కాకుండా ఒంటరిగా ఉంటున్నట్లు లేదా భర్త వదిలేసినట్లు స్థానిక తహసీల్దార్ ఇచ్చిన సర్టిఫికెట్ జతచేయాలి.

బీడీ కార్మికులు గుర్తింపు కార్డ్ ( పీఎఫ్ అకౌంట్ లేదా జీవనోపాధి సర్టిఫికెట్) అందించాలి.

ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు యాంటీ రిట్రోవైరల్ థెరపీ కేంద్రం జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్ జత చేయాలి.

ఇది కూడా చదవండి..: Mudiraj BC-A Demand | ముదిరాజ్‌లను బీసీ-ఏ జాబితాలోకి చేర్చాలి: ఈటల రాజేందర్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *