Hyderabad Passport Services | బక్రీద్ సెలవుతో మే 28 నాటి పాస్‌పోర్ట్ స్లాట్స్.. మే 27కే రీషెడ్యూల్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Hyderabad Passport Services | బక్రీద్ (ఈద్-ఉల్-జుహా) పండుగ ప్రభుత్వ సెలవు దినం మారిన నేపథ్యంలో.. హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం కీలక ప్రకటన చేసింది. మే 28వ తేదీన (గురువారం) పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులో ఉండవని అధికారులు వెల్లడించారు. ఈ మేరకు డిప్యూటీ పాస్‌పోర్ట్ ఆఫీసర్ ఐ. శ్రీనివాసరావు మంగళవారం ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.

Hyderabad Passport Services |సేవలు యథావిధిగా..

రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సెలవు దినాన్ని మొదట అనుకున్న మే 27వ తేదీకి బదులుగా మే 28కి మార్చడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా హైదరాబాద్ రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీస్ (RPO) పరిధిలోని ప్రధాన కార్యాలయంతో పాటు, అన్ని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (PSKs), పోస్ట్ ఆఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు (POPSKs) మే 28న పని చేయవు. అయితే, గతంలో సెలవుగా భావించిన మే 27వ తేదీన (బుధవారం) ఈ కార్యాలయాలన్నీ తెరిచే ఉంటాయని, సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయని అధికారులు స్పష్టం చేశారు.

pass poer.1

Hyderabad Passport Services |మే 27వ తేదీకే అపాయింట్‌మెంట్‌ల మార్పు..

మే 28వ తేదీన పాస్‌పోర్ట్ సేవల కోసం ముందుగానే అపాయింట్‌మెంట్‌లు బుక్ చేసుకున్న దరఖాస్తుదారులందరికీ ఆ స్లాట్‌లను మే 27వ తేదీకి (బుధవారం) మారుస్తూ (రీషెడ్యూల్) నిర్ణయం తీసుకున్నారు. ఈ మార్పునకు సంబంధించిన కొత్త తేదీ, సమయం వివరాలను దరఖాస్తుదారుల రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు మెసేజ్‌ల (SMS) రూపంలో ఇప్పటికే పంపినట్లు డిప్యూటీ పాస్‌పోర్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు తెలిపారు. దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించి, తమకు కేటాయించిన సవరించిన సమయానికి పాస్‌పోర్ట్ కేంద్రాలకు హాజరుకావాలని ఆయన కోరారు.
hyd 1

ఇది కూడా చదవండి: Mudiraj BC-A Demand | ముదిరాజ్‌లను బీసీ-ఏ జాబితాలోకి చేర్చాలి: ఈటల రాజేందర్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *