అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Golconda Fort | హైదరాబాద్ (Hyderabad)లోని గోల్కొండ కోటలో శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. వేడుకల సందర్భంగా కోట వద్ద ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గోల్కొండలో శనివారం ఉదయం 10 గంటలకు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరిసర ప్రాంతాల్లో పలు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డీ. జోయల్ డేవిస్ వెల్లడించారు. రామదేవ్‌గూడ నుండి గోల్కొండ కోట వైపు వెళ్లే రహదారిని సాధారణ వాహనాల కోసం పూర్తిగా మూసివేస్తారు.
Golconda Fort | పాస్ హోల్డర్లకు..
A (గోల్డ్), A(క్రీమ్), B (బ్లూ) కార్ పాస్‌లు కలిగిన ఆహ్వానితులు ఉదయం 6 నుండి 11 గంటల వరకు రామదేవ్‌గూడ మార్గం ద్వారా కోట వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది.సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం వైపు నుండి వచ్చే వాహనాలు రేతిబౌలి, నానల్ నగర్ జంక్షన్, బాలికా భవన్, లంగర్ హౌస్ ఫ్లైఓవర్, టిప్పు ఖాన్ బ్రిడ్జ్, రామదేవ్‌గూడ జంక్షన్ వద్ద కుడి మలుపు తీసుకుని మక్కై దర్వాజా ద్వారా గోల్కొండ కోట గేట్ వద్దకు చేరుకోవాలి.A (గోల్డ్) పాస్ ఉన్న వారు తమ వాహనాలను కోట (Golconda Fort ) ప్రధాన గేట్ ఎదురుగా ఉన్న ఫతే దర్వాజా రోడ్డులో పార్క్ చేయాలి.A (క్రీమ్), B (బ్లూ) ప్రధాన గేట్‌కు 50 మీటర్ల దూరంలో ఉన్న గోల్కొండ బస్ స్టాప్ వద్ద పార్కింగ్ చేయాలి.
సాధారణ ప్రజలు లంగర్ హౌస్ ఫ్లైఓవర్ కింద యు-టర్న్ తీసుకుని, ఫతే దర్వాజా వైపు వెళ్లే తవక్కల్ డైవర్షన్ పాయింట్ వద్ద ఉన్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో పార్కింగ్ చేయాలి. షేక్‌పేట్, టోలీచౌకి వైపు నుండి వచ్చే సాధారణ ప్రజలు సెవెన్ టాంబ్స్, డెక్కన్ పార్క్, లేదా గోల్కొండ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఫుట్‌బాల్ గ్రౌండ్లో వాహనాలు పార్క్ చేయవచ్చు.
దీనిని కూడా చదవండి : Samay Raina | స్టాండప్ కమెడియన్ సమయ్ రైనాకు ఊరట