అక్షరటుడే, వెబ్డెస్క్ : Samay Raina | స్టాండప్ కమెడియన్ సమయ్ రైనాకు సుప్రీం కోర్టు (Supreme Court)లో ఊరట లభించింది. సమయ్ రైనా పాపులర్ షో ఇండియాస్ గాట్ ట్యాలెంట్‌లో దివ్యాంగులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై దేశవ్యాప్తంగా క్రిమినల్ కేసులు నమోదు ఎకాగా.. సుప్రీంకోర్టు శుక్రవారం ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేసింది.
దివ్యాంగుల పట్ల సున్నితత్వం లేని వ్యాఖ్యలు చేసినందుకు హాస్యనటుడు సమయ్ రైనాతో పాటు మరో నలుగురిపై నమోదైన అన్ని ఎఫ్‌ఐఆర్‌లను సుప్రీంకోర్టు శుక్రవారం రద్దు చేయడంతో అతనికి పెద్ద ఊరట లభించింది. ‘ఇండియాస్ గాట్ లేటెంట్’ అనే షోలో చేసిన వ్యాఖ్యలకు గాను అతడితో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేశారు. అసభ్యకరమైన జోకులపై గతంలోనే ఆ హాస్యనటుడిని మందలించిన కోర్టు, దివ్యాంగుల కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, నిధులు సేకరించాలని రైనాను ఆదేశించింది.
Samay Raina | కోర్టు ఆదేశాలు పాటించడంతో..
ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ జె.వి. మోహనలతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలను రైనా, ఇతరులు పాటించడాన్ని గమనించి, వారిపై ఉన్న అన్ని కేసులను కొట్టివేసింది. దివ్యాంగుల ప్రయోజనం కోసం కార్యక్రమాలను నిర్వహించడానికి వారు చేసిన ప్రయత్నాలను కోర్టు అభినందించింది.
దీనిని కూడా చదవండి : Tirumala Darshan | శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ దర్శన కోటా విడుదల ఎప్పుడంటే?