Fastrack Laptop Bags | స్టైల్ విత్ కంఫర్ట్.. మార్కెట్లోకి ఫాస్ట్రాక్ కొత్త ల్యాప్‌టాప్ బ్యాగ్‌లు!

ద్యార్థులు, సృజనాత్మక రంగాల నిపుణులు, నిత్యం ప్రయాణాలు చేసే వారిని దృష్టిలో ఉంచుకుని ఫాస్ట్రాక్ బ్యాగ్స్ సరికొత్త ల్యాప్‌టాప్ కలెక్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Fastrack Laptop Bags | విద్యార్థులు, సృజనాత్మక రంగాల నిపుణులు, నిత్యం ప్రయాణాలు చేసే వారిని దృష్టిలో ఉంచుకుని ఫాస్ట్రాక్ బ్యాగ్స్ సరికొత్త ల్యాప్‌టాప్ కలెక్షన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. “క్యారీ మోర్, వెయిట్ లెస్” (తక్కువ బరువులో ఎక్కువ) అనే నినాదంతో రూపొందించిన ఈ కలెక్షన్‌లో స్టైల్, కంఫర్ట్‌కు పెద్దపీట వేశారు. ఆఫీసులు, కాలేజీలు, డైలీ జర్నీలకు ఇవి సరిగ్గా సరిపోతాయి.

Fastrack Laptop Bags | ఆకర్షణీయమైన డిజైన్లు..

బ్యాక్‌ప్యాక్‌లు, టోట్‌లతో కలిపి మొత్తం 12 కొత్త డిజైన్లలో ఈ కలెక్షన్ లభిస్తోంది. ఇందులో 10 నైలాన్ బ్యాగులు, 2 ఫాక్స్ లెదర్ డిజైన్ బ్యాగులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ డిజైన్లు 15-అంగుళాల ల్యాప్‌టాప్‌లకు సరిపోగా, మరో రెండు డిజైన్‌లను ప్రత్యేకంగా 14-అంగుళాల ల్యాప్‌టాప్‌ల కోసం రూపొందించారు. తెలుపు, చాక్లెట్ బ్రౌన్, మలాకైట్ గ్రీన్, చెర్రీ రెడ్, డస్టీ పింక్ వంటి విభిన్న రంగుల్లో ఈ బ్యాగులు అందుబాటులో ఉన్నాయి.

Fastrack Laptop Bags | ఆచరణాత్మక ప్రయోజనాలు ..

కేవలం చూడటానికి మాత్రమే కాకుండా.. వినియోగదారుల సౌకర్యం కోసం పలు ప్రత్యేక వసతులు కల్పించారు. ఇందులో కార్డ్ హోల్డర్లు, ప్రయాణంలో ట్రాలీకి సులభంగా అటాచ్ చేసుకునేందుకు ట్రాలీ లూప్, కీ లీష్ ఉన్నాయి. అలాగే రోజువారీ వస్తువులను భద్రపరుచుకోవడానికి అదనపు స్టోరేజ్ స్పేస్ అందుబాటులో ఉంది.

Fastrack Laptop Bags | యువత అవసరాలకు తగినట్లుగా ..

ఈ సందర్భంగా టైటాన్ కంపెనీ ( Titan Company )లిమిటెడ్ (యాక్సెసరీస్ అండ్ ఫ్రాగ్రెన్స్ డివిజన్) సీఈఓ మనీష్ గుప్తా మాట్లాడుతూ.. నేటి యువత తమ వ్యక్తిత్వాన్ని చాటేలా, అవసరాలను తీర్చే ఉత్పత్తులను కోరుకుంటోందని తెలిపారు. స్టైల్‌కు ఏమాత్రం భంగం కలగకుండా సౌకర్యాన్ని అందించేలా ఈ కలెక్షన్‌ను తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు.

ధర , లభ్యత వివరాలు..
ఈ ఫాస్ట్రాక్ ల్యాప్‌టాప్ కలెక్షన్ ప్రారంభ ధర రూ. 4,995గా ఉంది. ఎంపిక చేసిన ఫాస్ట్రాక్, షాపర్స్ స్టాప్, లైఫ్‌స్టైల్ స్టోర్లతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఈ బ్యాగులు కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి:  Samay Raina | స్టాండప్‌ కమెడియన్‌ సమయ్‌ రైనాకు ఊరట

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *