Danam Nagender Khairatabad | ఖైరతాబాద్ ఉపఎన్నికలలో ప్రత్యర్థులకు దిమ్మతిరిగే షాక్ ఇస్తాం: దానం నాగేందర్

ఖైరతాబాద్ నియోజకవర్గంలో త్వరలో జరగనున్న ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, ప్రత్యర్థులకు ఊహించని షాక్ తగులుతుందని ఆ పార్టీ నేత దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Danam Nagender Khairatabad | ఖైరతాబాద్ నియోజకవర్గంలో త్వరలో జరగనున్న ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని, ప్రత్యర్థులకు ఊహించని షాక్ తగులుతుందని ఆ పార్టీ నేత దానం నాగేందర్ ధీమా వ్యక్తం చేశారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ నెక్లెస్ రోడ్‌లో నిర్వహించిన కాంగ్రెస్ నిరసన ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

Danam Nagender Khairatabad | అద్భుతమైన ఫలితాలు ..

నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ ప్రభావాలు, కుట్రలు కాంగ్రెస్ గెలుపును ఆపలేవని దానం నాగేందర్ స్పష్టం చేశారు. ఖైరతాబాద్‌లో పార్టీ శ్రేణులు ఎంతో ఉత్సాహంగా శ్రమిస్తున్నాయని, రాబోయే ఉపఎన్నికలో అద్భుతమైన ఫలితాలు సాధించి తీరుతామని ఆయన పేర్కొన్నారు.

Danam Nagender Khairatabad | బీజేపీపై తీవ్ర ఆరోపణలు..

ఎన్నికల సంఘాన్ని అడ్డంపెట్టుకుని బీజేపీ భారీ స్థాయిలో ఓటు చోరీకి పాల్పడుతోందని దానం నాగేందర్ మండిపడ్డారు. గతంలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేవలం ఓటు చోరీ ద్వారానే గెలుపొందారంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

Danam Nagender Khairatabad | సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి..

ఎన్నికల ప్రక్రియను, ప్రజాస్వామ్య వ్యవస్థను నీరుగారుస్తున్న ఎన్నికల ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్‌కుమార్  ( Gyanesh Kumar ) తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు స్వయంగా సుమోటోగా స్వీకరించి, తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి:  BJP Corporators Protest | మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ కార్పొరేటర్లు..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *