Telangana Local Status | తెలంగాణ స్థానికతపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో స్థానిక రిజర్వేషన్ల కోసం నాలుగేళ్ల నిబంధన తప్పనిసరి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Local Status | తెలంగాణ (Telangana)లో స్థానికతపై సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్థానిక రిజర్వేషన్ల కోసం రాష్ట్రంలో కనీసం నాలుగేళ్లు చదవాల్సిందేనని పేర్కొంది. దీనిపై రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Telangana Local Status | పిటిషన్​ కొట్టివేత

స్థానికత అంశంపై బెల్లం అంకిత వేసిన పిటిషన్​ను జస్టిస్ పీఎస్ నరసింహ ధర్మాసనం సోమవారం విచారించింది. స్థానికత కోసం నాలుగేళ్ల విద్యాభ్యాస నిబంధన ఏకపక్షంగా ఉందని పిటిషనర్​ వాదించారు. అయితే ఆ వాదనలను కోర్టు తోసిపుచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వులు ప్రకారం తెలంగాణలో కనీసం నాలుగేళ్లు చదివిన వారే స్థానిక రిజర్వేషన్లకు అర్హులని స్పష్టం చేసింది. అంకిత పిటిషన్​ను కొట్టి వేసింది. స్థానికతపై గతంలో జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును న్యాయస్థానం గుర్తు చేసింది.

ఇది కూడా చదవండి..: Revanth Reddy Delhi Tour | ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి.. నామినేటెడ్ పోస్టులపై ఉత్కంఠ..!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *