అక్షరటుడే, వెబ్డెస్క్ : Singareni Medical Board | సింగరేణి మెడికల్ బోర్డుపై ప్రకటన చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు (TRS) కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. లేదంటే ఈ నెల 20 నుంచి నిరవధిక దీక్ష చేస్తానని ప్రకటించారు.
సింగరేణిలో కార్మికులకు డిపెండెంట్ ఉద్యోగాలు హక్కు ఉండాలని కవిత (Kalvakuntla Kavitha) పేర్కొన్నారు. మెడికల్ బోర్డు కచ్చితంగా నెలకు ఒకసారి పెట్టాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికులు ఎముకలు వంకర పోయే వరకు సమాజానికి సేవ చేస్తారని, వాళ్లు అనుకున్న వాళ్లకు డిపెండెంట్ ఉద్యోగం ఇచ్చుకునే హక్కు ఉండాలని పేర్కొన్నారు. ఇప్పుడు గెలిచిన సంఘాలు డిపెండెంట్ ఉద్యోగాలను గంగలో కలుపుతున్న అడగటం లేదని విమర్శించారు.
Singareni Medical Board | నెలకు రెండు సార్లు పెట్టాలి
ఈ నెల 20 లోపు మెడికల్ బోర్డు పెట్టకపోతే దీక్ష చేస్తానని ఇప్పటికే చెప్పినట్లు కవిత పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వం లీకులు ఇస్తోందన్నారు. కానీ ఒక్కసారి మాత్రమే మెడికల్ బోర్డు పెట్టి వదిలేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాలన్నీ క్లియర్ అయ్యే వరకు నెలకు రెండుసార్లు మెడికల్ బోర్డు పెట్టాలన్నారు. ఆ తర్వాత నెలకు ఒక్కసారి మెడికల్ బోర్డు కచ్చితంగా నిర్వహించాలని కోరారు. బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి కోల్ ఇండియాలో జరుగుతున్న మంచి పనులు సింగరేణిలో జరిగేలా చేయాలన్నారు. ఆయన తలుచుకుంటే వేజ్ బోర్డు అమలు అవుతుందన్నారు. అదే విధంగా పెర్క్స్ మీద ఐటీ తీసేయాలని కోరారు.
దీనిని కూడా చదవండి : Telangana Voter Revision | కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఎస్ఐఆర్ గడువు పొడిగింపు