Telangana Rakshana Sena | తెలంగాణ రక్షణ సేన నియోజకవర్గ ఇన్​ఛార్జీల నియామకం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Rakshana Sena | తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పలు నియోజకవర్గ ఇన్​ఛార్జీలను నియమించారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

తన పార్టీలో బీసీలు, మహిళలకు అవకాశాలు కల్పిస్తానని కవిత గతంలో పలుమార్లు చెప్పారు. ఈ క్రమంలో తాజాగా ఇన్​ఛార్జీల నియామకంలో బీసీలకు పెద్ద పీట వేశారు. 23 అసెంబ్లీ స్థానాలకు ఇన్​ఛార్జీలను నియమించగా.. అందులో 12 మంది బీసీ నేతలకు స్థానం కల్పించారు.. ఐదుగురు ఎస్సీలు, ఎస్టీ నేత ఒకరికి అవకాశం కల్పించారు. ఆరు చోట్ల ఓసీ నేతలను ఇన్​ఛార్జీలుగా నియమించారు. మిగతా నియోజకవర్గాలకు త్వరలో ఇన్​ఛార్జీలను నియమిస్తామని ప్రకటించారు. కొత్తగా నియామకం అయిన వారు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయాలని కవిత సూచించారు.

Singareni Medical Board

Telangana Rakshana Sena | ఇన్​చార్జీలు వీరే..

సిర్పూర్​– కావేసి సబిత, బెల్లంపల్లి– బోడ జనార్దన్​, బోథ్​ – రాథోడ్​ బాపూరావు, ఆర్మూరు – మంథెన నవీన్​రెడ్డి, ఎల్లారెడ్డి – సంపత్​ గౌడ్​, కామారెడ్డి – నంగునూరి రవీందర్​ గుప్తా, జగిత్యాల – పునుగోటి పవన్​ రావు, మానకొండూరు – చెన్నమల చైతన్య, సిరిసిల్ల – ఎండీ అబ్దుల్ మాజీద్​, సంగారెడ్డి – దయాకర్​రెడ్డి, అంధోల్ –మాసన్నగారి బాలయ్య, నారాయణఖేడ్ – మలిశెట్టి బాపు, నర్సాపూర్ – చెల్లంగారి అపర్ణ, మెదక్ – బట్టి అజయ్​, శేరిలింగంపల్లి – వాసిలి చంద్రశేఖర ప్రసాద్, తుంగతుర్తి – సూరారపు కృష్ణవేణి, స్టేషన్​ ఘన్​పూర్​ – చిలుక ప్రవీణ్​, మక్తల్​ – వెంకటన్న, గద్వాల్ – రంజిత్​కుమార్​, నారాయణ్​పేట – శ్రీనివాస్​, మునుగోడు – కర్నాటి మాధవి, పెద్దపల్లి – సలేంద్ర కొమురయ్య, హుస్నాబాద్ – శ్రావణ్ కుమార్​ గౌడ్​.

దీనిని కూడా చదవండి : CBSE On-Screen Marking | సీబీఎస్‌ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్‌లో లోపాలు.. సుప్రీంకోర్టు ఆగ్రహం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *