అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Heatwave | రాష్ట్రంపై భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 9 గంటలు దాటిందంటే చాలు ఎండ తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. దీంతో ప్రజలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. అత్యవసరమైన పనులు ఉంటే తప్పా బయటకు వెళ్లడం లేదు. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగాయి.
Telangana Heatwave | సుమారు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు..
తెలంగాణలో నిన్న నిర్మల్ జిల్లా (Nirmal District)లో అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నిజామాబాద్ 45.9, ఆదిలాబాద్ 45.6, కామారెడ్డి 45.5, జగిత్యాల 45.5, సిద్దిపేట 45.2, కుమురం భీమ్ 45.1, నల్గొండ 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే మిగతా జిల్లాలోనూ 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.
Telangana Heatwave | వడగాలులతో ఇబ్బందులు
ఉత్తర, తూర్పు తెలంగాణలో వడగాలులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నేడు ఉష్ణోగ్రతలు 45.5°C కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని చాలా అంతర్గత ప్రాంతాల్లో వేడి పొడి వాతావరణం కొనసాగుతోంది. దీంతో ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Telangana Heatwave | హైదరాబాద్‌లోనూ..
హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఉష్ణోగ్రతలు నేడు సుమారు 42–43°C మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. అయితే నగర శివారు ప్రాంతాల్లో ఇవి 44°C మార్కును దాటే ఛాన్స్ ఉంది. మధ్యాహ్న సమయంలో వేడి తీవ్రత అధికంగా ఉంది.
వర్షపాత సూచన..
దక్షిణ, పశ్చిమ తెలంగాణ ప్రాంతాలు ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ, నాగర్‌కర్నూల్ జిల్లా (Nagarkurnool District)ల్లో సాయంత్రం వేళల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అలాగే హైదరాబాద్‌లోని పశ్చిమ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి..: Harish Rao | కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్..: మాజీ మంత్రి హరీశ్ రావు


[…] […]