Congress Bhavan | రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్​ భవనాలు: టీపీసీసీ చీఫ్

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Congress Bhavan | రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్​ భవనాలు (Congress Bhavan) నిర్మించనున్నట్లు టీపీసీసీ చీఫ్​ బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ తెలిపారు. నిజామాబాద్​ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో కాంగ్రెస్ నూతన భవన నిర్మాణానికి మంత్రి సీతక్కతో కలిసి (Minister Seethakka)​ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో మొదటి భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్​ పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తయ్యాక రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేతులమీదుగా ప్రారంభిస్తామని తెలిపారు.

Congress Bhavan | త్యాగాలకు మారుపేరు కాంగ్రెస్

త్యాగాలకు మారుపేరు కాంగ్రెస్ అని మహేశ్​ కుమార్​ గౌడ్​ అన్నారు. దేశం కోసం ఎందరో కాంగ్రెస్​ నాయకులు తమ జీవితాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. కానీ దేశాన్ని బీజేపీ కులాలు మతాల పేరిట విభజిస్తోందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వందకు పైగా సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ మొలకెత్తదని.. ఆ పార్టీకి భవిష్యత్తు లేదని వ్యాఖ్యానించారు.

Congress Bhavan | కేసీఆర్ సతమతం

కవిత పార్టీపై పీసీసీ చీఫ్​ స్పందించారు. కవిత పార్టీని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అయితే పదేళ్ల బీఆర్ఎస్ పాపపు పాలనలో ఆమె పాత్ర కూడా ఉందని వ్యాఖ్యానించారు. కవిత ప్రశ్నలకు జవాబు చెప్పలేక కేసీఆర్ సతమతం అవుతున్నారన్నారు.

ఎన్నో ఏళ్ల కల

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ భవనాలు ఏర్పాటు చెయ్యాలనేది ఎన్నో ఏళ్ల కల అని మహేశ్​ కుమార్​ గౌడ్​ తెలిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి తొలుత సొంత జిల్లాలో పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్​ జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నగేష్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నగర మేయర్ ఉమారాణి, కాంగ్రెస్ సీనియర్​ నాయకులు తాహెర్​బిన్​ హందాన్​, రత్నాకర్, కేశవేణు, నగర కాంగ్రెస్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

12 1

ఇది కూడా చదవండి: Sampally Canal Encroachment | ప్రజాప్రతినిధి కుటుంబీకుల ఆగడాలు.. సాంపల్లి చెరువు అలుగు కాలువ కబ్జాకు యత్నం.. గ్రామస్థుల ఆందోళన!

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *