Minister Seethakka | తాగునీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి: మంత్రి సీతక్క

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Minister Seethakka | గ్రామాల్లో తాగునీటి సమస్య (drinking water supply) తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ(Panchayat Raj) మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మంగళవారం కామారెడ్డి(Kamareddy) కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, ఎంపీ సురేష్ షెట్కార్ తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Minister Seethakka | తాగు,సాగునీటి పరిస్థితిపై..

మంత్రి సీతక్క తాగునీటి సరఫరా, సాగునీటి పరిస్థితి, సివిల్ సప్లయ్​(Civil Supplies), ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం (Indiramma Houses), ఎండాకాలంలో వడదెబ్బల నివారణ చర్యలు, ప్రభుత్వం అమలు చేస్తున్న 99 రోజుల సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సమగ్రంగా చర్చించారు. విద్యార్థులు, దివ్యాంగుల కోసం సహాయ ఉపకరణాలను పంపిణీ చేశారు. 64 మంది దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు, బ్యాటరీ ట్రైసైకిళ్లు పలు సహాయక ఉపకరణాలను అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని అధికారులను దిశానిర్దేశం చేశారు. ఎండాకాలంలో జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు.

Minister Seethakka | తాగునీరు అందించాలి

ప్రతి గ్రామానికి తాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సాగునీటి అవసరాలు కూడా సమయానికి తీర్చాలని అధికారులకు మంత్రి సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఎటువంటి ఆలస్యం లేకుండా పనులను వేగవంతం చేయాలని, అర్హులందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరే విధంగా సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. దివ్యాంగుల సంక్షేమాన్ని ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని తెలిపారు. దివ్యాంగులు సమాజంలో స్వయం సమృద్ధిగా జీవించేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి అర్హుడికి ప్రభుత్వ పథకాల లబ్ధి చేరేలా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని సూచించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన సఖి కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ అండ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ కార్యదర్శి అనిత రామచంద్రన్, కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Kamareddy Fuel Shortage | కామారెడ్డిలో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కష్టాలు

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *