Kalyana Lakshmi Scheme | కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి: మాజీమంత్రి వేముల

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎప్పటిలాగే కొనసాగించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

shashi kiran Mottala

భీమ్​గల్(వేల్పూర్), అక్షరటుడే: Kalyana Lakshmi Scheme | కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎప్పటిలాగే కొనసాగించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వేల్పూర్ మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

Kalyana Lakshmi Scheme | పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసా..

ధర్నా కార్యక్రమంలో బాల్కొండ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి (Vemula Prashanth Reddy) మాట్లాడుతూ.. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక భరోసా కల్పించాలనే ఉన్నతమైన లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాలను తీసుకొచ్చారని గుర్తుచేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణలక్ష్మి చెక్కుతో పాటు తులం బంగారం ఇస్తామని ఆశచూపి ఓట్లు వేయించుకుందని, తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీని నీరుగార్చిందని మండిపడ్డారు.

అంతేకాకుండా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కూడా రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. పేదల సంక్షేమానికి సంబంధించిన ఈ పథకాలను ఎలాంటి కోతలు లేకుండా కొనసాగించాలని, ఇచ్చిన హామీ ప్రకారం తులం బంగారం అందించాలని డిమాండ్ చేశారు. పేదల హక్కుల సాధన కోసం, సంక్షేమ పథకాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి..: CMR Rice Scam | ఒక్కొక్కటిగా బయటికొస్తున్న సీఎంఆర్​ బాగోతాలు.. మరో రైస్​మిల్​లో ధాన్యం గల్లంతు..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *