అక్షరటుడే,నిజామాబాద్ సిటీ: Sneha Society Services | అంధ విద్యార్థుల కోసం స్నేహా సొసైటీ చేస్తున్న సేవలు అభినందనీయమని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (MLA Bhupathi Reddy) అన్నారు. జిల్లా కేంద్రంలోని (Nizamabad) తారక రామనగర్‌లో స్నేహా సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన అంధుల ప్రత్యేక పాఠశాల భవనాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు.
Sneha Society Services | సొసైటీ అభివృద్ధికి కృషి చేస్తా
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మామూలు విద్యార్థులకు విద్యను బోధించడం కష్టమైన ఈ పరిస్థితుల్లో అంధ విద్యార్థులకు ఓపికతో విద్య నేర్పుతున్న స్నేహా సొసైటీ సేవలు అభినందనీయమన్నారు. 1999 నుండి అంధ విద్యార్థులను అక్కున చేర్చుకొని వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారన్నారు. స్నేహా సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, కార్యదర్శి సిద్దయ్య, ఉపాధ్యాయ సిబ్బంది చేస్తున్న కృషి వర్ణించలేనిదన్నారు. సొసైటీ అభివృద్ధికి నావంతు బాధ్యతగా కలెక్టర్, విద్యాశాఖ, సంబంధిత అధికారులతో మాట్లాడుతానన్నారు.
ప్రస్తుతం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, మోడల్ స్కూల్స్ ఇలా చాలా రకాలుగా పాఠశాలలను తెరుస్తున్నామన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసిన విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దాసరి విజయనంద రావు, దారం గంగాధర్ , డాక్టర్ సవిత రాణి, సేర్ల దయానంద్, తాటి సుధాకర్ తదితరులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నుడా ఛైర్మన్ కేశ వేణు, వయోజన విద్య ఉపసంచాలకులు ఏ పురుషోత్తం, 18వ డివిజన్ కార్పొరేటర్ పసునూరి రమేష్, ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, అమృతపూర్ గంగాధర్, మూత జనార్దన్, ఖ్యాతం హన్మాండ్లు, గూడ శ్రీనివాస్ రెడ్డి, జలంధర్, కనకయ్య పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: నేపాల్ వరదలు.. చిట్టిచెల్లిని భుజాలపై మోసుకెళ్తూ..