అక్షరటుడే, ఇందూరు: TGEJAC Nizamabad | సీపీఎస్ అంతమయ్యేవరకు (CPS Abolition) పోరాటం చేస్తామని టీజీఈజేఏసీ జిల్లా ఛైర్మన్, టీఎన్జీవోస్(TNGOs Nizamabad) జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్ కుమార్ పేర్కొన్నారు. సెప్టెంబర్1న పెన్షన్ విద్రోహ దినాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.
TGEJAC Nizamabad | సీపీఎస్ రద్దు.. పెండింగ్ సమస్యలపై..
ఈ సందర్భంగా సుమన్ కుమార్ మాట్లాడుతూ.. 2004 తర్వాత ఉద్యోగులందరికీ గుదిబండల మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం అంతమై పాత పెన్షన్ విధానం అమలయ్యేంతవరకు ఈ పోరాటాన్ని ఆపేది లేదన్నారు. పెండింగ్ సమస్యలపై టీజీఈజేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10వ తేదీన ఎల్బీ స్టేడియంలో ఏర్పాటుచేసిన మహాధర్నా కార్యక్రమానికి ఉద్యమస్ఫూర్తితో తరలిరావాలన్నారు.
ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారం కావాలని నినాదాలు చేశారు. ఈ సమావేశానికి టీజీఈజేఏసీ భాగస్వామ్య సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు రమేష్, శ్రీకాంత్, ప్రవీణ్, జమీలుల్లా, ధర్మేందర్, పండరీనాథ్, హన్మాండ్లు, కృష్ణారెడ్డి, నేరెళ్ల శ్రీనివాస్, బీరేందర్ సింగ్, దండు స్వామి, టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సతీష్, సహాధ్యక్షులు పెద్దోళ్ల నాగరాజు, టీఎన్జీవో ఉపాధ్యక్షుడు సంజీవయ్య, అతిక్ అహ్మద్, శివకుమార్, మాణిక్యం, పద్మ, సునీత, విజయలక్ష్మి, గీతారెడ్డి, మంగారెడ్డి, విజయలక్ష్మి, శ్రీవేణి, నిరంజన్ గౌడ్, విశాల్, గంగరాజు, ప్రకాష్, సునీల్, స్వామి, రవి,ఎడ్విన్ వినయ్ రాజ్॑ తదితరులు హాజరయ్యారు.
ఇది కూడా చదవండి: టీటీడీ బోర్డు సభ్యుడి కుమారుడు అరెస్ట్