అక్షరటుడే, బాన్సువాడ: RTC Workers | ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీ కార్మికుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పరిష్కరించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం బాన్సువాడ ఆర్టీసీ డిపో వద్ద కార్మికులకు బీజేపీ నాయకులు సంఘీభావం తెలిపారు.
RTC Workers | రాష్ట్ర ఏర్పాటులో ఆర్టీసీ కార్మికులే కీలకం..
ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర (Telangana State) ఏర్పాటుకు ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత వారి సమస్యలు పరిష్కారమవుతాయని ఆశించినా, ఇప్పటికీ అవి పరిష్కారం కాలేదన్నారు. 2019లో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన సమ్మెను ప్రస్తావిస్తూ, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే ప్రకటన కార్మికుల్లో ఆందోళన కలిగించిందన్నారు. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వస్తే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా, ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోవడం, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం దురదృష్టకరమని తెలిపారు.

RTC Workers | ప్రభుత్వం స్పందించాలి..
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు బీజేపీ బాన్సువాడ శాఖ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటంలో ముందుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్, కౌన్సిలర్ గజ్జల మహేష్, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ, మాజీ అసెంబ్లీ కన్వీనర్ గుడుగుడ్ల శ్రీనివాస్, పట్టణ ఉపాధ్యక్షుడు గుడుగుట్ల అనిల్, నాయకులు చీకట్ల రాజు, పాశం భాస్కర్ రెడ్డి, సామల శ్రీకాంత్, చంద్రశేఖర్ గౌడ్, ప్రదీప్ సింగ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: RTC Bus Protest | కామారెడ్డిలో బందోబస్తు మధ్య కదిలిన బస్సులు..

