IT Stocks | పడేసిన ఐటీ.. భారీ నష్టాల్లో ముగిసిన సూచీలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్:IT Stocks | అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి చర్చల విషయంలో అనిశ్చితి కొనసాగుతుండడంతో గ్లోబల్ మార్కెట్లు (Global Markets) ఒత్తిడికి గురవుతున్నాయి. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్ కూడా నష్టాల బాటలో పయనించింది.

ప్రధానంగా ఐటీ సెక్టార్ మార్కెట్లను కిందికి లాగింది. బుధవారం ఉదయం సెన్సెక్స్ 254 పాయింట్ల నష్టంతో ప్రారంభమై 12 పాయింట్లు పెరిగింది. అమ్మకాల ఒత్తిడితో మరో 589 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 106 పాయింట్ల నష్టంతో ప్రారంభమై తొలుత 45 పాయింట్లు పెరిగింది. తర్వాత ప్రాఫిట్ బుకింగ్‌తో 163 పాయింట్లు పడిపోయింది. చివరికి సెన్సెక్స్ 756 పాయింట్ల నష్టంతో 78,516 వద్ద, నిఫ్టీ 198 పాయింట్ల నష్టంతో 24,378 వద్ద స్థిరపడ్డాయి.

IT Stocks | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 2,440 కంపెనీలు లాభపడగా 1,838 స్టాక్స్ నష్టపోయాయి. 144 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 152 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 41 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

IT Stocks | మిక్స్‌డ్ గా సూచీలు..

నిఫ్టీలో యుటిలిటీ ఇండెక్స్ 2.48 శాతం, పవర్ 1.97 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.11 శాతం, ఎఫ్ ఎంసీజీ 0.75 శాతం లాభపడ్డాయి. ఐటీ ఇండెక్స్ 3.89 శాతం, ఆటో 0.66 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.64 శాతం, బ్యాంక్ నిఫ్టీ 0.43 శాతం నష్టపోయాయి.

IT Stocks

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 11 స్టాక్స్ లాభపడగా.. 19 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. హెచ్ యూఎల్ 2.75 శాతం, ఎన్టీపీసీ 2.39 శాతం, ఎటర్నల్ 1.39 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.35 శాతం, ట్రెంట్ 0.96 శాతం లాభపడ్డాయి.

Top Losers : హెచ్‌సీఎల్ టెక్ 10.85 శాతం, ఇన్ఫోసిస్ 3.40 శాతం, ఎం అండ్ ఎం 2.99 శాతం, టీసీఎస్ 2.80 శాతం, టెక్ మహీంద్రా 2.50 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Gold Silver Rates April 22 | బంగారం, వెండి ధరల్లో ఊగిసలాట.. మళ్లీ ఆల్‌టైమ్ హై దిశగా ప‌రుగులు..!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *