Skoda India Network | భారత్‌లో దూసుకెళ్తున్న స్కోడా ఆటో.. 350 కస్టమర్ టచ్‌పాయింట్ల మైలురాయి దాటిన నెట్‌వర్క్

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Skoda India Network | దేశవ్యాప్తంగా తన మార్కెట్‌ను విస్తరిస్తూ, కస్టమర్లకు మరింత చేరువయ్యే దిశగా స్కోడా ఆటో ఇండియా భారీ మైలురాయిని చేరుకుంది. భారత్‌లోని 193 నగరాల్లో తన కస్టమర్ టచ్‌పాయింట్ల సంఖ్యను 350 కంటే పైగా పెంచుకున్నట్లు సంస్థ ప్రకటించింది. అక్టోబర్ 30, 2026న మణిపూర్‌లోని ఇంఫాల్‌లో 350వ టచ్‌పాయింట్‌ను ప్రారంభించడంతో స్కోడా ఆ రాష్ట్రంలోనూ అడుగుపెట్టింది.

Skoda India Network  | ఐదేళ్లలో 85 శాతం వృద్ధి..

2021లో కేవలం 191గా ఉన్న స్కోడా టచ్‌పాయింట్ల సంఖ్య, 2025 నాటికి 325కు, అక్టోబర్ 2026 నాటికి 350 మార్కును తాకింది. ఐదేళ్ల కాలంలో దాదాపు 85 శాతం పెరుగుదలను సాధించింది. 2024లో 25 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోని 156 నగరాల్లో ఉన్న నెట్‌వర్క్, ప్రస్తుతం 29 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోని 193 నగరాలకు విస్తరించింది. 79 డీలర్ భాగస్వాముల మద్దతుతో మొత్తం 270 సేల్స్ టచ్‌పాయింట్లు, 203 ఆఫ్టర్‌సేల్స్ వర్క్‌షాప్‌లు నడుస్తున్నాయి.

Skoda India Network | 25% పైగా విక్రయాలు..

మెట్రో నగరాలతో పాటు చిన్న నగరాలు, పట్టణాలకు స్కోడా తన నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. 2026లో బాలాసోర్, బారామతి, బఠిండా, బికనీర్, గుణ, ఇంఫాల్, జోర్హాట్, కైతల్, ఖమ్మం, శ్రీ గంగానగర్, వసాయి వంటి 11 కొత్త నగరాల్లోకి బ్రాండ్ ప్రవేశించింది. కాగా, జనవరి 2026 నుండి అక్టోబర్ 2026 వరకు స్కోడా నమోదు చేసిన మొత్తం విక్రయాలలో 25 శాతానికి పైగా అమ్మకాలు ఈ కొత్త అవుట్‌లెట్ల నుంచే రావడం గమనార్హం.

Skoda India Network | అనుభవంలో నెంబర్ 1..

నెట్‌వర్క్ విస్తరణతో పాటు కస్టమర్ సంతృప్తికి స్కోడా పెద్దపీట వేస్తోంది. 16 నగరాలు, 18 బ్రాండ్లు, 88,000 మంది కస్టమర్ రివ్యూల ఆధారంగా CarPhD నిర్వహించిన సర్వేలో డీలర్‌షిప్ కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌లో స్కోడా డీలర్ నెట్‌వర్క్ నెం.1 స్థానంలో నిలిచింది. కస్టమర్లకు మరింత అభయమిస్తూ 4 ఏళ్ల ప్రామాణిక వారంటీ, రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ఫ్రీ సర్వీస్ లేబర్‌తో కూడిన ‘స్కోడా సూపర్ కేర్’, వేగవంతమైన సర్వీస్ కోసం ‘స్కోడా ఎక్స్‌ప్రెస్ కేర్’ సేవలనూ అందిస్తోంది.

భారతదేశంలో ( India ) బ్రాండ్‌ను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సేల్స్, ఆఫ్టర్‌సేల్స్ సేవల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తున్నామని స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు.

ఇది కూడా చదవండి:  Anganwadi Services | అంగన్​వాడీ కేంద్రాల సేవలు వినియోగించుకోవాలి: కలెక్టర్​ గరిమా అగ్రవాల్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *