అక్షరటుడే,నిజామాబాద్ క్రైం: Nizamabad Food Safety Raids | నగరంలోని (Nizamabad) పలు స్వీట్లు, ఖారా తయారీ కేంద్రాలపై టీజీ సేఫ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు పలు తయారు కేంద్రాలను సీజ్ చేశారు.
Nizamabad Food Safety Raids | 14 బృందాలతో..
నగరంలోని స్వీట్స్, ఖారా, ఐస్‌క్రీమ్ తయారీ కేంద్రాలపై తెలంగాణ సేఫ్ (TG SAFE) ఫుడ్ వింగ్ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పలు స్వీట్ల తయారీ కేంద్రాల్లో అపరిశుభ్ర వాతావరణంలో స్వీట్లు, ఖారా తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. స్థానిక ఆహార భద్రతా విభాగం నేతృత్వంలో మొత్తం 14 బృందాలుగా ఏర్పడిన అధికారులు నగరంలోని వివిధ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు.
Nizamabad Food Safety Raids | తయారీ కేంద్రాల్లో ఎలుకలు..
ఈ తనిఖీల్లో పలు తయారీ కేంద్రాలు అత్యంత అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలను తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తినుబండారాలు తయారు చేసే ప్రాంతాల్లో ఎలుకలు, ఈగలు, ఇతర పురుగులు తిరుగుతుండటం చూసి అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఖారా తయారీకి ఉపయోగించే యంత్రాలు తుప్పుపట్టి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలింది. పలు తయారీ యూనిట్లు కనీస ‘ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ (FSSAI) లైసెన్స్ లేకుండానే నడుస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు.
Nizamabad Food Safety Raids | పలు కేంద్రాలు సీజ్..
నిబంధనలు తీవ్రంగా ఉల్లంఘించిన కొన్ని తయారీ కేంద్రాలను అధికారులు తక్షణమే మూసివేయించారు. మరికొన్ని యూనిట్ల నిర్వాహకులకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, పరిశుభ్రతా ప్రమాణాలు పాటించాలని మరికొందరికి ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు అందించారు. ప్రజారోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని, ఆహార భద్రతా నిబంధనలు పాటించని వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఫుడ్ వింగ్ అధికారులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: నిలోఫర్ సూపరింటెండెంట్ ను సస్పెండ్ చెయ్యాలి.