Telangana Weather | నేడు రాష్ట్రానికి మోస్తరు వర్ష సూచన

తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళవారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Weather | తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాల్లో మంగళవారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. రాత్రివేళ వాన పడుతుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, నిర్మల్​, నిజామాబాద్​, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్​, వికారాబాద్​, రంగారెడ్డి, మహబూబ్​నగర్​, నాగర్​కర్నూల్​, వనపర్తి, నారాయణపేట, గద్వాల్​ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురుస్తాయి. హైదరాబాద్​ నగరంలో మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది.

Telangana Weather | మళ్లీ ఎల్​నినో ప్రభావం

రాష్ట్రంలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. అయితే ఎల్​నినో ప్రభావంతో రానున్న రోజుల్లో లోటు వర్షపాత నమోదు అవుతుందని వాతావరణ నిపుణుడు బాలాజీ తెలిపారు. రానున్న 7 నుంచి 10 రోజుల్లో పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదు అవుతుంది. మిగతా జిల్లాల్లో తక్కువ వర్షాలు కురుస్తాయి. ఆగస్టు 20 తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు తగ్గుముఖం పడుతాయి.

ఇది కూడా చదవండి..: delhi-nakili-call | ఢిల్లీ కేంద్రంగా నకిలీ కాల్‌ సెంటర్ల మోసం.. 21 మంది తెలంగాణ వాసుల అరెస్టు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *