TRS Party Name | కవిత పార్టీకి ‘TRS’ పేరు దక్కుతుందా? ఈసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?

Shashi kiran Mottala

అక్షరటుడే, హైదరాబాద్: TRS Party Name | తెలంగాణ రాజకీయాల్లో ‘మూడు అక్షరాల’ మ్యాజిక్ మళ్లీ మొదలైంది. ఒకప్పుడు కేసీఆర్ (KCR)  నేతృత్వంలో ఉద్యమ కెరటమై ఎగిసిన ‘TRS’ పేరు, ఇప్పుడు ఆయన కుమార్తె కవిత రూపంలో కొత్త చర్చకు దారితీసింది. కవిత తన పార్టీకి ‘తెలంగాణ రాష్ట్ర సేన’ అని పేరు పెట్టడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి.

TRS Party Name | ఇంకా ఆరేళ్ల వరకు ‘లాక్ పీరియడ్:

బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) కవిత నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ పేరు మార్చినప్పటికీ, పాత పేరు (తెలంగాణ రాష్ట్ర సమితి)కు ఇంకా ఆరేళ్ల వరకు ‘లాక్ పీరియడ్’ ఉంటుందని వారు వాదిస్తున్నారు. “సమితికి బదులు సేన అని మార్చినా, అది ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉంది. టీఆర్ఎస్ అనే బ్రాండ్ మా సొంతం. దీనిపై ఎన్నికల సంఘానికి (EC) ఫిర్యాదు చేస్తాం” అని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పేర్కొన్నారు. అవసరమైతే న్యాయపోరాటానికి కూడా వెనకాడబోమని స్పష్టం చేశారు.

TRS Party Name | సాంకేతికత ఏం చెబుతోంది?

ఎన్నికల సంఘం (Election Commission) నిబంధనల ప్రకారం.. ఒక పార్టీ తన పేరును అధికారికంగా మార్చుకున్నప్పుడు, పాత పేరు ‘ఫ్రీ పూల్’లోకి వెళ్తుంది. అంటే సాంకేతికంగా ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ అనే పేరు ప్రస్తుతం ఖాళీగానే ఉంది. కవిత నేరుగా పాత పేరును వాడకుండా, ‘సమితి’ స్థానంలో ‘సేన’ అని చేర్చారు.

ఈసీ విచక్షణాధికారం: ఓటర్లను గందరగోళానికి గురిచేసేలా పేర్లు ఉంటే, వాటిని నిరాకరించే అధికారం ఈసీకి ఉంటుంది. అయితే షార్ట్ కట్ పేర్ల (TRS) విషయంలో ఈసీ ఎంతవరకు కఠినంగా ఉంటుందనేది ప్రశ్నార్థకం.

TRS Party Name | బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదమం:

కేసీఆర్ తన పార్టీని జాతీయ రాజకీయాల కోసం ‘బీఆర్ఎస్’గా మార్చిన తర్వాత, తెలంగాణ అనే సెంటిమెంట్ బ్రాండ్ కొంత తగ్గిందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు అదే సెంటిమెంట్‌ను అందిపుచ్చుకోవడానికి కవిత ‘తెలంగాణ’, ‘టీఆర్ఎస్’ అనే పదాలను ఆయుధంగా వాడుతున్నారు. ఈ పేరు కవితకు దక్కితే, అది బీఆర్ఎస్ ఉనికికే ప్రమాదమని ఆ పార్టీ భావిస్తోంది.

ప్రజల్లోకి నెగటివ్ సంకేతాలు :

ఈ వివాదంపై కేసీఆర్ న్యాయపోరాటం చేసే అవకాశం ఉన్నప్పటికీ, అది ప్రజల్లోకి నెగటివ్ సంకేతాలు పంపే ప్రమాదం ఉంది. “సొంత పేరును కూడా కాపాడుకోలేకపోయారా?” అనే భావన ఓటర్లలో కలిగితే అది పార్టీ నైతిక బలాన్ని దెబ్బతీస్తుంది.

ఇది కూడా చదవండి..: Kavitha New Party | ఇక పిట్టల దొరసాని క్యారెక్టర్​ను చూస్తాం.. కవిత కొత్త పార్టీపై ఎంపీ అర్వింద్​ సెటైర్లు..

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *