CM Revanth Reddy | ఎస్సీ, ఎస్టీల అభివృద్ధే లక్ష్యం : సీఎం రేవంత్​రెడ్డి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: CM Revanth Reddy | దళితులు, గిరిజనులు, ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి ద్వారానే సమాజంలో మార్పు వస్తుందన్నారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ (SC/ST Atrocity) చట్టం అమలుపై సీఎం మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ చట్టం కింద నమోదైన కేసులు, దర్యాప్తు, విచారణ వివరాలను ఆయన తెలుసుకున్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలో అట్రాసిటీ కేసులు తగ్గాయని అధికారులు తెలిపారు. 73 గ్రామాల్లో ఎక్కువ కేసులు నమోదు అవుతున్నట్లు వివరించారు. అక్కడ ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. అత్యాచార ఘటనల్లో బాధితులకు నష్టపరిహారం, సహాయ పునరావాసం అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

CM Revanth Reddy | ఇందిరమ్మ ఇళ్లలో ప్రాధాన్యం

ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ జనాభా 16 శాతం ఉండగా, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల్లో వారు 31శాతం ఉన్నారన్నారు. ఎస్టీ జనాభా 10 శాతం ఉంటే, 17 శాతం ఇండ్లను మంజూరు చేసినట్లు వెల్లడించారు. చదువుతోనే జీవితాలు మారుతాయన్నారు. పిల్లలను చదువు, క్రీడల వైపు ప్రోత్సహించాలని కోరారు.

దీనిని కూడా చదవండి : Telangana New Pensions | కొత్త పింఛన్ల పంపిణీకి సర్కార్ కీలక నిర్ణయం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *