Government Pre Primary Timings | సర్కార్​ బడుల్లో ‘ప్రీ ప్రైమరీ’ టైమింగ్స్​ మార్పు

ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతుల సమయ వేళలను ప్రభుత్వం మార్చింది. కొత్త టైమింగ్స్​ ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు కానున్నాయి.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Government Pre Primary Timings | రాష్ట్ర ప్రభుత్వం (State Government) ప్రైవేట్​ పాఠశాలలకు ధీటుగా సర్కార్​ బడుల్లో వసతులను కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పలు పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులను గతేడాది ప్రారంభించింది. మరికొన్ని బడుల్లో ఈ ఏడాది ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ఇన్​స్ట్రక్టర్లు, ఆయాల నియామకం చేపడుతోంది.

ప్రభుత్వ బడుల్లో ప్రీ ప్రైమరీ తరగతుల సమయ వేళలను తాజాగా ప్రభుత్వం మార్చింది. 2026-27 విద్యా సంవత్సరం నుంచి జిల్లాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు కొనసాగనున్నాయి. హైదరాబాద్/సికింద్రాబాద్‌లో ఉదయం 8:45 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు క్లాసులు ఉంటాయి. వేసవిలో ఉదయం 7:45 నుంచి 12:30 వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ (Education Department) ఆదేశాలు జారీ చేసింది.

Government Pre Primary Timings | పెరగనున్న విద్యార్థుల సంఖ్య

Government Pre Primary Timings

గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి ప్రవేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రైవేట్​లో నర్సరీ, ఎల్​కేజీ, యూకేజీ ఉంటాయి. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్​ బడులకు పంపడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ బడుల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించింది. అంతేగాకుండా విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అల్పాహారం అందించే పథకాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనుంది.

ఇది కూడా చదవండి..: Hyderabad Development Projects | రూ.1,674.74 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *