ACB Trap | స్టేషన్​ బెయిల్ కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన ఎస్సై

స్టేషన్​ బెయిల్ కోసం లంచం అడిగిన ఎస్సైని ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటన హైదరాబాద్​లోని గాంధీనగర్​ పోలీస్​ స్టేషన్​లో చోటు చేసుకుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారుల తీరు మారడం లేదు. నిత్యం ఏసీబీ అధికారులు దాడులు చేపట్టి రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకుంటున్నారు. మరోవైపు అక్రమాస్తుల కేసుల్లో సైతం దూకుడు పెంచారు. అయినా లంచాలకు మరిగిన అధికారులు మారడం లేదు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. తాజాగా ఓ ఎస్సై లంచం తీసుకుంటూ దొరికాడు.

హైదరాబాద్ (Hyderabad)​ నగరంలోని గాంధీనగర్​ పోలీస్​ స్టేషన్​ ఎస్సై వి నర్సింహులును ఏసీబీ అధికారులు మంగళవారం వలపన్ని పట్టుకుఉన్నారు. ఓ వ్యక్తికి స్టేషన్​ బెయిల్ ఇవ్వడానికి ఆయన రూ.లక్ష లంచం డిమాండ్​ చేశాడు. అందులో నుంచి రూ.50 వేలు తీసుకుండగా ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, ఎస్సైని అరెస్ట్ చేశారు. అతడిని జ్యుడిషియల్ రిమాండ్ కోసం నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని అధికారులు తెలిపారు.

ACB Trap | లంచం అడిగితే ఫోన్​ చేయండి

ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్​ 9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్​సైట్ (ACB Website)​ ద్వారా కంప్లైట్​ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

దీనిని కూడా చదవండి : Brahmajivadi Bus | బ్రహ్మాజీవాడికి బస్సోచ్చింది.. ఊరంతా సంబరపడింది..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *