Eatala Rajender | సీఎం రేవంత్​రెడ్డి క్షమాపణ చెప్పాలి : ఎంపీ ఈటల రాజేందర్​

ఎల్​నినో నేపథ్యంలో కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి సాగునీరు ఇవ్వాలని ఎంపీ ఈటల రాజేందర్​ కోరారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eatala Rajender | గోదావరి జలాల తరలింపుపై మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్​ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు. రిటైర్డ్ ఇంజనీర్ల పట్ల మాట్లాడిన మాటలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

సోమాజిగూడ (Somajiguda) ప్రెస్​క్లబ్​లో జరిగిన రౌండ్​ టేబుల్ సమావేశంలో ఈటల మాట్లాడారు. ​2023లో లక్ష్మీ బ్యారేజీ (Laxmi Barrage) పిల్లర్లు కుంగిపోయాయన్నారు. ఇంజనీర్లు తప్పు డిజైన్ ఇస్తే వారిని, కాంట్రాక్టర్ తప్పు చేస్తే వారిని, పాలకులు అహంకారంతో ఇంజనీర్లను, కాంట్రాక్టర్లను ఇన్ఫ్లుయెన్స్ చేశారని ప్రూవ్ అయితే వారిని శిక్షించాలన్నారు. కానీ రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని పేర్కొన్నారు. సమైక్యాంధ్రలో కూడా సీఎంలు సంయమనంతో సమాధానం చెప్పారు. కానీ మన సీఎం ఇలా మాట్లాడడం ప్రజలను కుంగదీస్తుందన్నారు.

Eatala Rajender | గుణపాఠం చెబుతారు

Eatala Rajender Support

ఈరోజు ప్రజలు మాట్లాడకపోవచ్చు, కానీ సందర్భం వచ్చినప్పుడు కర్రుకాల్చి గుణపాఠం చెప్తారని ఈటల రాజేందర్​ అన్నారు. ​ఎల్​నినోతో కరువు వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నా.. సీఎం స్పందించకపోవడం సరికాదన్నారు. ​కన్నెపల్లి వద్ద నీళ్లు వృథాగా పోతున్నాయని, ఆ నీటిని ఎత్తిపోయాలని కోరారు. ​అత్యవసర పరిస్థితుల్లో కూడా మొండిగా, గుడ్డిగా, అజ్ఞానంగా సీఎం వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

దీనిని కూడా చదవండి : Devadula Project | దేవాదుల ద్వారా 22 రిజర్వాయర్లు నింపుతాం : డిప్యూటీ సీఎం భట్టి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *