అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nagavali Express | నగరంలో(Nizamabad) భారీగా గంజాయిని ఎక్సైజ్ పోలీసులు (Ganja Seizure) పట్టుకున్నారు. ఈ మేరకు సోమవారం ఎస్‌హెచ్‌వో వివరాలు వెల్లడించారు.
Nagavali Express | దర్జాగా రైళ్లలో గంజాయి సరఫరా..
ఎస్‌హెచ్‌వో తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని రైల్వేస్టేషన్‌కు వస్తున్న నాగావళి ఎక్స్‌ప్రెస్‌లో గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో స్టేషన్లో రైలు ఆగిన అనంతరం తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న బీహార్‌కు చెందిన అఖిల్ ఆలం, మహమ్మద్ చాంద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుండి 5.1కిలోల గంజాయి,రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు. తనిఖీల్లో ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్ ఏ.గంగాధర్, మల్లేష్, ట్రెయినీ ఏఈఎస్ గాయత్రి, కానిస్టేబుళ్లు దేవేందర్, శైలేష్, గౌతమ్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర సీఎం