OBC Morcha | ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా బొబ్బిలి వేణుగోపాల్​

రాష్ట్రంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​ రావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: OBC Morcha | రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర (BJP Telangana) అధ్యక్షుడు రాంచందర్​ రావు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు.

OBC Morcha | జిల్లా ఓబీసీ అధ్యక్షుడిగా..

రాష్ట్రంలో 21 జిల్లాలకు సంబంధించి బీజేపీ ఓబీసీ అధ్యక్షులను నియమించారు. ఈ సందర్భంగా నిజామాబాద్​ జిల్లా ఓబీసీ(BJP Nizamabad) అధ్యక్షుడిగా బొబ్బిలి వేణుగోపాల్​(Bobbili Venugopal) నియమితులయ్యారు. నగరంలో సీనియర్​ నాయకుడిగా సేవలందిస్తున్న ఆయనను అధిష్టానం గుర్తించి ఈ పదవిని కట్టబెట్టింది. ఈ సందర్భంగా వేణుగోపాల్​ మాట్లాడుతూ.. పార్టీ తన సేవలను గుర్తించి పదవి ఇచ్చిందని.. శాయాశక్తులా ఈ పదవికి న్యాయం చేస్తానన్నారు. కేంద్ర పథకాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్తామని జిల్లాలోని ఓబీసీలను కలుపుకుని ముందుకు వెళ్తానని ఆయన తెలిపారు.

nizamabad 2

ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌లో విషాదకర ఘటన

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *