Raja Singh | కొందరి స్వార్థంతో తెలంగాణలో బీజేపీ ఎదగడం లేదు : ఎమ్మెల్యే రాజాసింగ్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Raja Singh | బీజేపీ (BJP) నేతలపై ఎమ్మెల్యే రాజా సింగ్ హాట్ కామెంట్స్ చేశారు. ఇంకా ఎన్ని సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ముంచుతారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

బెంగాల్ (Bengal)​, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజాసింగ్​ వీడియో విడుదల చేశారు. బెంగాల్​లో గెలిస్తే ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారని, ఇంకా ఎన్ని సంవత్సరాలు వేరోళ్ళ పెళ్లిళ్లలో పోయి డాన్స్ చేస్తారు చెప్పండని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు తీసుకుని వస్తారో చెప్పాలన్నారు.

Raja Singh | నేతలకు సిగ్గు ఉంటే..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే తెలంగాణలో అధికారం వస్తుందని రాజాసింగ్​ అన్నారు. ఇక్కడ కొందరు నేతలు ఈగోయిజం పక్కన పెట్టాలని హితవు పలికారు. కొందరు నేతలకు సిగ్గు ఉంటే బెంగాల్ గెలుపులో కార్యకర్తల సంకల్పం చూసి తెలుసుకోవాలని సూచించారు. బెంగాల్‌లో మమతా బెనర్జీ (Mamata Banerjee) రాక్షస పాలనను ఎదిరించి బీజేపీ జెండా పాతడం వెనుక కార్యకర్తల బలమైన సంకల్పం ఉందన్నారు. అక్కడ హిందూ సంఘాల కార్యకర్తలను చంపినా.. గుండా రాజ్యాన్ని ఎదుర్కొని ప్రాణాలకు తెగించి పనిచేశారని కొనియాడారు. మనరాష్ట్రంలో కూడా అటువంటి పట్టుదల అవసరమని పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : KTR Allegations | మా కెమెరాలు, ఫోన్లు హ్యాక్​ చేస్తున్నారు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *