Farmers Protest | ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతుల రాస్తారోకో

Balla Sandeep Kumar

అక్షరటుడే, డిచ్​పల్లి: Farmers Protest | వరి కోతలు పూర్తవడంతో అన్నదాతలు ధాన్యాన్ని విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాలకు తరలించారు. అయితే కొనుగోళ్లు జరగకపోవడం ఇబ్బందులు పడుతున్నారు. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనళకు దిగుతున్నారు.

Farmers Protest | డిచ్​పల్లి మండలం ధర్మారంలో..

ధాన్యం కాంట చేయడం లేదని ఆగ్రహిస్తూ డిచ్​పల్లి మండలం ధర్మారం(బి)లో రైతులు సోమవారం సాయంత్రం ప్రధాన రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. కొనుగోలు కేంద్రంలో చాలా రోజులుగా ధాన్యం నిల్వలు పేరుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరగంటకు పైగా రైతులు ఆందోళన చేయడంతో నిజామాబాద్ – హైదరాబాద్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. తహశీల్దార్ సతీశ్​ రెడ్డి, ఎస్సై ఆరీఫ్ వారి వద్దకు చేరుకుని రైతులను ఒప్పించే ప్రయత్నం చేశారు. ధాన్యం సేకరించే వరకు ఊరుకోబోమని సంచులు లేవని, లారీలు రావడం లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఆందోళనతో రోడ్డుపై గందరగోళం నెలకొంది. రేపు రెండు లారీలు పంపిస్తానని తహసీల్దార్ స్పష్టమైన హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

ఇది కూడా చదవండి..: Farmers Protest | కాంగ్రెస్‌ పాలనలో రైతులను దోచుకుంటున్నారు..

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *