Vijay Krishna | బీజేవైఎం రాష్ట్ర కోశాధికారిగా అమంద్ విజయ్ కృష్ణ

shashi kiran Mottala

అక్షరటుడే, ​నిజామాబాద్ సిటీ: Vijay Krishna| బీజేవైఎం (యువమోర్చా) (BJYM Telangana) రాష్ట్ర కమిటీలో నిజామాబాద్ జిల్లాకు(Nizamabad BJP) చెందిన సీనియర్ నాయకుడు అమంద్ విజయ్ కృష్ణకు కీలక బాధ్యతలు దక్కాయి. ఆయనను రాష్ట్ర కోశాధికారిగా నియమిస్తూ పార్టీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

Vijay Krishna | అంకితభావంతో

​గత 15 ఏళ్లుగా పార్టీకి అంకితభావంతో సేవలు అందిస్తూ.. డివిజన్ కార్యదర్శి స్థాయి నుండి రాష్ట్ర కోశాధికారిగా ఎదిగిన విజయ్ కృష్ణ నియామకం పట్ల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అమంద్ విజయ్ కృష్ణ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి, ఎంపీ ధర్మపురి అర్వింద్ (MP Arvind), ఎమ్మెల్యే ధన్​పాల్ (Mla Dhanpal)​, జిల్లా ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో యువమోర్చా ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై మరిన్ని పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: New Pensions | జూన్ 2 నుంచి కొత్త పింఛన్లు.. అర్హతలు, కావాల్సిన సర్టిఫికెట్లు ఇవే..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *