అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandi Bhagirath Custody | బండి భగీరథ్‌పై నమోదు అయిన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనను పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని భగీరథ్‌పై పోక్సో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని పేట్‌బషీరాబాద్ (Pet Basherbad) పోలీస్ స్టేషన్లో మే 8న ఆయనపై కేసు నమోదు అయింది. అయితే 9 రోజుల పాటు నిందితుడు పరారీలో ఉన్నాడు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు (High Court)ను ఆశ్రయించగా.. అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. దీంతో తన న్యాయవాదులతో కలిసి భగీరథ్ మే 16న పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనను పోలీసులు కోర్టులో హాజరు పర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
Bandi Bhagirath Custody | మూడు రోజుల కస్టడీకి..
బండి భగీరథ్ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రధాన పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ కేసు విచారణకు ఇప్పటికే ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. కేసులో కీలక వివరాలు సేకరించడానికి నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు మల్కాజ్గిరి కోర్టు (Malkajgiri Court)లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నాలుగు రోజుల క్రితం వాదనలు విన్న న్యాయమూర్తి విచారణను నేటికి వాయిదా వేశారు. నేడు విచారణ అనంతరం భగీరథ్‌ను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ కేసు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

దీనిని కూడా చదవండి : RTC Driver Removal | వడ్లు కొనమన్నందుకు.. ఆర్టీసీ డ్రైవర్‌ను విధుల్లో నుంచి తీసేశారు!


