తెలంగాణ Kavitha Political Statement | కాంగ్రెస్​ను గద్దె దించుతాం.. టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కవిత

 Kavitha Political Statement | కాంగ్రెస్​ను గద్దె దించుతాం.. టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కవిత

కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. బషీర్​ బాగ్​ ప్రెస్​క్లబ్​లో కవిత మీట్​ ది ప్రెస్​ కార్యక్రమంలో మాట్లాడారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kavitha Political Statement | కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) అన్నారు. బషీర్​ బాగ్​ ప్రెస్​క్లబ్​లో కవిత మీట్​ ది ప్రెస్​ కార్యక్రమంలో మాట్లాడారు. కాంగ్రెస్​ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ పార్టీని అధికారం నుంచి దించేస్తామని, వచ్చే ఎన్నికల్లో తాము విజయం సాధిస్తామని కవిత అన్నారు.

తెలంగాణ (Telangana) రక్షణ సేన పేరుతో ప్రజల ముందుకు వచ్చామని కవిత అన్నారు. ప్రజల సమస్యలను ఎత్తిచూపే వేదికగా పనిచేస్తామని తెలిపారు. ప్రజల తరఫున పోరాడుతామని పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి అనే సంస్థ అలాగే కొనసాగుతుందని చెప్పారు. సర్వోదయ తెలంగాణ సాధించాలని తమ లక్ష్యమన్నారు. పాంచజన్యం పేరుతో ఓ ప్రణాళిక రూపొందించామన్నారు. పాంచజన్యం అంటే శ్రీకృష్ణుడి శంఖం పేరు అని చెప్పారు. ఆయన అధర్మంపై యుద్ధం చేసినట్లు, తాము ప్రజా సమస్యల పరిష్కారానికి యుద్ధ భేరీ మోగిస్తామన్నారు.

 Kavitha Political Statement | ఉచిత విద్య అందిస్తాం

పాంచజన్యంలో మొదటి అంశంగా విద్యను ఎంచుకున్నామని కవిత తెలిపారు. పేద, మధ్య తరగతి కుటుంబాల్లో 60 శాతం ఆదాయం విద్య, వైద్యానికి పోతుందన్నారు. దీంతో విద్యను ఉచితంగా అందించాలని తాము సంకల్పం తీసుకున్నామన్నారు. ప్రైవేట్​ స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఉచిత విద్య అందించాలన్నారు. తాము అధికారంలోకి వచ్చాక దీనిని అమలు చేస్తామన్నారు. అందరికి ఉచిత వైద్యం అందిస్తామన్నారు. ఎన్ని లక్షలు ఖర్చు అయినా.. దీనిని అమలు చేస్తామని ప్రకటించారు.

 Kavitha Political Statement | యువతకు రుణాలు ఇస్తాం

టీఆర్​ఎస్​ (TRS) అధికారంలోకి వచ్చాక రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం ధాన్యం, మక్కల కొనుగోళ్లు సక్రమంగా జరగడం లేదన్నారు. దీంతో రైతులు ఎండలో పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు గౌరవం దక్కేలా తాము చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. యువత ఉపాధి కోసం అండగా ఉంటామన్నారు. వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపే వారికి రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు ఇస్తామన్నారు. తొలి ఏడాదిలోనే నాలుగు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. సీనియర్​ సిటిజన్ల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. పాంచజన్యంలో ఐదో అంశం సామాజిక న్యాయం అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు తాను అమ్మ అవుతానని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమకారుల కోసం లక్ష సూపర్​ న్యూమరిక్​ పోస్టులు వేస్తామన్నారు.

 Kavitha Political Statement | అండగా ఉంటాం

ఎస్సీ, ఎస్టీ సబ్​ ప్లాన్​ కింద కేటాయించిన నిధుల్లో సీఎం కోత పెట్టారన్నారు. భారీగా కేటాయించి, తక్కువ ఖర్చు చేశారన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇలాంటివి జరగకుండా చూస్తామన్నారు. మైనారిటీల సంక్షేమాన్ని కాంగ్రెస్​ విస్మరించిందని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి కోసం భూములు కోల్పోయిన వారికి అండగా ఉంటామని ప్రకటించారు. అవసరం అయితే న్యాయ సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

 Kavitha Political Statement | హామీలు అమలు చేయకుండా..

కాంగ్రెస్​ హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని కవిత అన్నారు. ఫ్యూచర్​ సిటీ పేరిట రియల్​ ఎస్టేట్​ దందా చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్​ పాలనలో మహిళలపై అత్యాచారాలు పెరిగాయన్నారు. మతపరమైన ఘర్షణలు సైతం పెరిగాయని ఆరోపించారు. వీటిని ఎందుకు నియంత్రించడం లేదని సీఎంను ప్రశ్నించారు. ప్రజలను కలుస్తామని చెప్పిన సీఎం, ఒక్కసారి మాత్రమే ప్రజావాణికి వచ్చారన్నారు. సచివాలయానికి సైతం రావడం లేదని విమర్శించారు.

 Kavitha Political Statement | నా తండ్రిని విమర్శించలేదు

తాను తన తండ్రిని విమర్శించలేదని, రాజకీయ నాయకుడు కేసీఆర్ (KCR)​ను విమర్శించానని కవిత తెలిపారు. తండ్రిగా ఆయన లేకపోతే తనకు జన్మ లేదన్నారు. తల్లిదండ్రులతో తనకు సమస్యలు లేవన్నారు. బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​తో తనకు సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయని చెప్పారు. అందుకే విమర్శించానని, భవిష్యత్​లో సైతం విమర్శిస్తానని స్పష్టం చేశారు. తాను ఏదైనా తప్పు చేస్తే బీఆర్ఎస్​ వాళ్లు విమర్శించవచ్చన్నారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వం కృష్ణ గోదావరి జలాలను సక్రమంగా వాడుకోలేదన్నారు.

నన్ను కట్టేసి కొట్టండి

తాను బీఆర్​ఎస్​లో ఉన్నప్పుడు ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను కేసీఆర్​ దృష్టికి తీసుకెళ్లానని టీఆర్​ఎస్​ అధ్యక్షురాలు కవిత చెప్పారు. అయితే వాటిని ఆయన పట్టించుకోలేదన్నారు. అప్పుడు తాను కొంచెం గట్టిగా మాట్లాడి ఉండాల్సిందన్నారు. అలా చేయనందుకు రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పినట్లు తెలిపారు. రానున్న రోజుల్లో పాంచజన్యంలోని హామీలను అమలు చేయకపోతే అమరవీరుల స్థూపం వద్ద తనను కట్టేసి రాళ్లతో కొట్టాలన్నారు.

తనకు షోకాజ్​ నోటీసులు ఇవ్వకుండా పార్టీ నుంచి సస్పెండ్​ చేశారన్నారు. తన వివరణ తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనను బీఆర్​ఎస్​ వద్దు అనుకుందని, దీంతో ప్రజల్లో ఉండేందుకు కొత్త పార్టీ ఏర్పాటు చేశానని చెప్పారు. తన పార్టీలో వేలాది మంది చేరుతున్నారని తెలిపారు. తమ పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామన్నారు.

ఇది కూడా చదవండి..: Defamation Case MLA | ఎమ్మెల్యేపై పరువునష్టం దావా కేసు..

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

Share post:

Popular

More like this
Related

Gold Loans | గోల్డ్ లోన్లకు భారీ డిమాండ్.. రెండేళ్లలో ఐదు రెట్లు పెరుగుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gold Loans | దేశంలో బంగారం తనఖా పెట్టి...

Amazon Summer Sale | సమ్మర్ సేల్ కు అమెజాన్ రెడీ.. మే 8 నుంచే గ్రేట్ సమ్మర్ సేల్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Amazon Summer Sale | అమెజాన్ (Amazon)...

Flipkart Sale | ఫ్లిప్‌కార్టులో ఆఫర్ల జాతర.. 9 నుంచి సాసా లేలే సేల్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Flipkart Sale | షాపింగ్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్...