అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Telangana Aerospace Hub | తెలంగాణను ఏరోస్పేస్ హబ్‌గా మారుస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) తెలిపారు. వరంగల్, ఆదిలాబాద్, కొత్తగూడెంలో మూడు కొత్త ఎయిర్‌ఫీల్డ్‌లను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని, అలాగే తెలంగాణలో తమ తయారీ కార్యకలాపాలను విస్తరించుకోవాలని ప్రపంచ ఏరోస్పేస్ కంపెనీలకు ఆయన ఆహ్వానం పలికారు.
ఏరోమార్ట్ హైదరాబాద్ 2026లో కార్యక్రమాన్ని మంత్రి ఉత్తమ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. నిరంతర విధానపరమైన మద్దతు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, పరిశ్రమలకు అనుకూలమైన పాలన నమూనాతో తెలంగాణ ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్ తయారీ కేంద్రాలలో ఒకటిగా రూపాంతరం చెందిందని అన్నారు. ఏరోస్పేస్‌లో పొరపాటుకు అస్సలు ఆస్కారం లేదన్నారు. ఒకే ఒక్క భాగం లేదా సీల్ మిషన్ విజయం, మిషన్ వైఫల్యం మధ్య తేడాను నిర్ణయించగలదని పేర్కొన్నారు.
Telangana Aerospace Hub | వేగంగా అభివృద్ధి
రెండున్నర సంవత్సరాలలో తెలంగాణ ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఉన్న స్థాయి నుండి, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఏరోస్పేస్ తయారీ కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందిందని మంత్రి అన్నారు. అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, జపాన్, ఇజ్రాయెల్ మరియు కెనడాతో సహా పలు ప్రధాన ఏరోస్పేస్ దేశాల నుండి తెలంగాణ నిరంతరం పెట్టుబడులను ఆకర్షిస్తోందని ఆయన పేర్కొన్నారు. స్పెయిన్ గత నెలలో హైదరాబాద్‌లో ఐటీపీ ఏరో తయారీ కేంద్రానికి తెలంగాణలో శంకుస్థాపన చేసిందని మంత్రి తెలిపారు. గత కొన్నేళ్లుగా తెలంగాణ ఏరోస్పేస్, రక్షణ పరిశ్రమ దాదాపు 30 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందని వెల్లడించారు.
Telangana Aerospace Hub | కొత్త విమానాశ్రయాలు

తెలంగాణ వ్యాప్తంగా మూడు కొత్త విమానయాన సౌకర్యాల కోసం ప్రభుత్వం ప్రణాళికలను ఆవిష్కరించిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌కు సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ప్రతిపాదిత వరంగల్ ఎయిర్‌ఫీల్డ్‌కు వచ్చే నెలలో శంకుస్థాపన చేస్తామన్నారు. ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టును పౌర, సైనిక విమానయాన కేంద్రంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. కొత్తగూడెంలో మరో ఎయిర్‌ఫీల్డ్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు.
దీనిని కూడా చదవండి : Nitin Nabin Criticisms | తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంలా వాడుకుంటోంది: నితిన్ నబీన్