అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Gold Inspections | జిల్లాలోని బంగారు దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని వినియోగదారుల మండలి(Consumer Council) జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, జిల్లా వినియోగదారుల సంక్షేమ సమితి ప్రధాన కార్యదర్శి సందు ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు లీగల్ మెట్రాలజీ (Legal Metrology) ఇన్స్పెక్టర్ సందీప్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు.
Gold Inspections | కార్పొరేట్ బంగారు ఆభరణాలు దుకాణాల్లో..
బంగారు ఆభరణాల నాణ్యతను తనిఖీ చేసేందుకు లీగల్ మెట్రాలజీ శాఖకు అన్ని అధికారాలు ఉన్నాయని సంఘం ప్రతినిధులు పేర్కొన్నారు. నిజామాబాద్(Nizamabad) జిల్లాలోని కార్పొరేట్ బంగారు నగల వ్యాపారస్తులు (Jewelry Shops) నాణ్యతకు సంబంధించిన హెచ్‌యూఐడీ నెంబర్‌ను రాయకుండా, నాణ్యతతో సంబంధించిన పూర్తి వివరాలు తెలపకుండా గోప్యంగా ఉంచుతున్నారన్నారు. వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న క్రమంలో ఆ షాపులలో అమ్మకం జరుగుతున్న ఆభరణాల నాణ్యత ప్రమాణాలను లీగల్ మెట్రాలజి శాఖ తప్పనిసరిగా తనిఖీ నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు. లీగల్ మెట్రాలజీ రూల్స్ 2011 రూల్ నెంబర్ 9 (4) (5)ల ప్రకారం శాఖకు పూర్తి అధికారాలున్నా ఎందుకు తనిఖీ చేయట్లేదని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు వీఎన్ వర్మ, సంయుక్త కార్యదర్శులు మహాదేవుని శ్రీనివాస్, యాటకర్ల దేవేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి : Kavitha Education Demands | ఈ నెలలోనే ‘ఫీజుల నియంత్రణ చట్టం’ తీసుకురావాలి: కల్వకుంట్ల కవిత
