నిజామాబాద్Mopal Police Station | శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం..

Mopal Police Station | శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకం..

సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసుల పాత్ర కీలకమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్​ భూపతి రెడ్డి అన్నారు. మోపాల్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

అక్షరటుడే, డిచ్​పల్లి: Mopal Police Station | సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసుల పాత్ర అత్యంత కీలకమని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్​ భూపతి రెడ్డి (MLA bhupathi reddy) అన్నారు. మోపాల్ (Mopal) మండల కేంద్రంలో నూతనంగా నిర్మించనున్న పోలీస్ స్టేషన్ నిర్మాణానికి ఏసీపీ ప్రకాష్, సీఐ సురేష్, ఎస్సై సుస్మిత, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు.

Mopal Police Station | పోలీస్​స్టేషన్​ నిర్మాణానికి..

అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ నిర్మాణంలో మండలంలోని అన్ని గ్రామాల నాయకులు తమవంతుగా సహకారం అందించడం అభినందనీయమన్నారు. కాగా పోలీస్ స్టేషన్ నిర్మాణానికి తనవంతుగా రూ.10 లక్షలు కేటాయించారు. పోలీస్ స్టేషన్ అంటే కేవలం పోలీసులది మాత్రమే అనే అపోహను ప్రజలు వీడాలని, అది ప్రజల భద్రత కోసం ఏర్పాటు చేయబడిందని తెలియజేశారు.

అందరి సహకారంతో పోలీస్ స్టేషన్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసుకొని త్వరలోనే ప్రారంభించుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ ముప్ప గంగారెడ్డి, రాష్ట్ర కల్లుగీత కార్మిక సహకార కార్పొరేషన్ ఛైర్మన్ శేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోపాల్ సాయి రెడ్డి, సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు జలందర్, స్థానిక సర్పంచ్ రవి, మాజీ ఎంపీపీ యాదగిరి, ప్రతాప్ సింగ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి పొలసాని శ్రీనివాస్, రాంచందర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:Vijay OSD | వెనక్కి తగ్గిన విజయ్​.. ఓఎస్​డీ నియామకం రద్దు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Jogipet Diesel Theft| జోగిపేటలో చెడ్డి గ్యాంగ్ కలకలం.. బస్సులు, లారీలే లక్ష్యంగా డీజిల్ చోరీ

అక్షరటుడే వెబ్‌డెస్క్:Jogipet Diesel Theft|సంగారెడ్డి జిల్లా జోగిపేటలో అర్ధరాత్రి వేళ దొంగలు...

Gold Price Hike | సామాన్యులకు చుక్కలు చూపిస్తున్న పసిడి..ఒకేరోజు రూ.వేలల్లో పెరుగుదల

అక్షరటుడే, కామారెడ్డి: Gold Price Hike | పసిడి కొనాలనుకునే వారికి...

Kavitha Demands Lookout Notice| బండి భగీరథ్​పై లుకౌట్ నోటీసులు ఇవ్వాల్సిందే: కవిత

అక్షరటుడే వెబం‌డెస్క్: Kavitha Demands Lookout Notice | కేంద్ర మంత్రి...

Rice Mill Inspection | రైస్ మిల్లులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Rice Mill Inspection | అకాలవర్షాల నేపథ్యంలో...