నిజామాబాద్Transgender Protest | కలెక్టరేట్​ ఎదుట ట్రాన్స్​జెండర్ల ధర్నా.. గ్రామాల్లోకి రానివ్వడం లేదని ఫిర్యాదు

Transgender Protest | కలెక్టరేట్​ ఎదుట ట్రాన్స్​జెండర్ల ధర్నా.. గ్రామాల్లోకి రానివ్వడం లేదని ఫిర్యాదు

కలెక్టరేట్​ ఎదుట ట్రాన్స్​జెండర్లు ధర్నాకు దిగారు. తమను గ్రామాల్లోకి రానివ్వడం లేదని అధికారులకు ఫిర్యాదు చేశారు.

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Transgender Protest |నగరంలోని కలెక్టరేట్​ ఎదుట ట్రాన్స్​జెండర్లు ధర్నాకు దిగారు. తమను గ్రామాల్లోకి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రజావాణి (Prajavani)లో అధికారులకు ఫిర్యాదు చేశారు.

Transgender Protest | వీడీసీల నిర్ణయంపై ఆగ్రహం

ట్రాన్స్​జెండర్స్ సంక్షేమ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఓరుగంటి గంగ, జరీనా బేగం మాట్లాడుతూ.. గ్రామాల్లోకి ట్రాన్స్​జెండర్లు వీడీసీలు ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేస్తున్నాయని ఆరోపించారు. ఇటీవల సిరికొండ మండలం (Sirikonda Mandal) మైలారం గ్రామంలో చిన్న పిల్లల్ని అపహరిస్తున్నారంటూ భౌతికదారులకు దిగారన్నారు. అలాగే నందిపేట మండలం హుస్నాపూర్​లో హిజ్రాలను జీపీలో అక్రమంగా నిర్బంధించారని పేర్కొన్నారు. మోపాల్ మండలం (Mopal Mandal)లో హిజ్రాలు రావొద్దంటూ పోస్టర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు.

Transgender Protest | ఎంతవరకు న్యాయం..

తమను పూర్తిగా సామాజిక బహిష్కరణ చేయడం ఎంతవరకు సబబని ట్రాన్స్​జెండర్లు ప్రశ్నించారు. ఎక్కడైనా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరిగితే వెళ్లి వారిని ఆశీర్వదించి ఇచ్చినంత తీసుకొని వస్తామని.. అలాంటి తమపై దుష్ప్రచారం చేయడం సరైనది కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు గ్రామాభివృద్ధి కమిటీలు ఎస్సీ, ఎస్టీ బీసీలను బహిష్కరణ చేస్తే నేడు హిజ్రాలను సైతం బహిష్కరణ చేయడం పూర్తిగా చట్ట విరుద్ధమని వారు పేర్కొన్నారు. ఇప్పటికైనా ట్రాన్స్​జెండర్లపై భౌతికదాడులను నిరోధించాలని మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న వీడీసీలపై చర్యలు తీసుకోవాలని వారు అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్​జెండర్ల సంక్షేమ సంఘం సభ్యులు వంకాయల అక్షర, ఆర్తి, శ్యామల, ఆసది, అలక, ప్రియ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: GPO Assistants | జీపీవోలకు అసిస్టెంట్లను నియమించాలి..

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Modi Telangana Visit | తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Modi Telangana Visit | తెలంగాణ (Telangana)లో ప్రధాని మోదీ...

Tim David Controversy | భువీ సిక్సర్ తర్వాత టిమ్ డేవిడ్ వివాదాస్పద సెలబ్రేషన్.. బ్యాన్ విధిస్తారా..!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tim David Controversy | రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు-ముంబై...

Rupee Under Pressure | తీవ్ర ఒత్తిడిలో రూపాయి..

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rupee Under Pressure | అంతర్జాతీయ ఉద్రిక్తతలతో ముడి...

Motorbike Accident | ట్రాఫిక్​ సిగ్నల్​ పోల్​కు చిక్కుకున్న బైక్​

అక్షరటుడే, వెబ్​డెస్క్: Motorbike Accident | కెనడా (Canada)లో వింత రోడ్డు...