అక్షరటుడే, ఇందూరు: Pulse Polio Campaign | పోలియో రహిత సమాజం మనందరి లక్ష్యమని అడిషనల్ కలెక్టర్(స్థానిక సంస్థలు) భుజంగరావు అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు.
Pulse Polio Campaign | ఆదివారం పల్స్ పోలియో..
నగరంలోని బస్టాండ్, తిలక్ గార్డెన్ చౌరస్తా మీదుగా డీఐవో ఆఫీసు వరకు పోలియో అవగాహన ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులందరికి జూన్ 28 ఆదివారం పల్స్ పోలియో (Pulse Polio) చుక్కల మందును అందించాలన్నారు. ఏ ఒక్కరు తప్పిపోకుండా పకడ్బందీ ప్రణాళికతో కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. జూన్ 28 ఆదివారం బూత్ వద్ద ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కల మందు వేస్తారని, బూత్ వద్ద చుక్కల మందు వేయించని చిన్నారులకు జూన్ 29, 30 తేదీల్లో గృహ సందర్శన చేసి మందు అందించాలన్నారు. పోలియోపై అవగాహన కలిగించే పోస్టర్లను అడిషనల్ కలెక్టర్ ఆవిష్కరించారు.
Pulse Polio Campaign | జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు 1,91,883 మంది

ర్యాలీ అనంతరం డీఎంహెచ్‌వో రాజశ్రీ మాట్లాడుతూ.. జిల్లాలో ఐదేళ్లలోపు చిన్నారులు మొత్తం 1,91,883 ఉన్నారన్నారు. వీరందరికి పోలియో చుక్కలు వేయడానికి 1,007 బూత్‌లను ఏర్పాటు చేసినట్లు, పట్టణ కేంద్రాల్లో 241 బూత్‌లను, గ్రామీణ ప్రాంతాల్లో 766 బూత్‌లను, 37 ట్రాన్సిట్ బూత్‌లను, 37 మొబైల్ బూత్‌లను, 101 పర్యవేక్షణ అధికారులను, 4,277 బూత్ మెంబర్లను, 428 ఆరోగ్య కార్యకర్తలను, 1,112 ఆశ కార్యకర్తలను, 1,501 అంగన్వాడీ కార్యకర్తలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమం కోసం 2,11,100 పోలియో డోసులను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ రాములు, డీఐవో అశోక్, డిప్యూటీ డీఎంహెచ్‌వో సికందర్ నాయక్, ప్రోగ్రాం అధికారులు వెంకన్న, నవ్య, వెంకటేష్, వైద్యాధికారులు అజ్మతున్నిసా, సుసేన, ప్రత్యూష, ప్రతాప్, ఎస్వో రాజేశ్వర్, డిప్యూటీ డెమో దుర్గారావు, డీహెచ్ఈలు ఘన్పూర్ వెంకటేశ్వర్లు, మనోహర్, సలీం తదితరులున్నారు.
ఇది కూడా చదవండి..: Student Welfare Facilities | విద్యార్థులకు సౌకర్యాలు అందేలా పర్యవేక్షించాలి: ప్రత్యేక అధికారి విజయేంద్ర