Kalki Cheruvu Repairs | బుంగ మరమ్మతు పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి: ఎమ్మెల్యే పోచారం

పట్టణంలోని కల్కి చెరువు బుంగ మరమ్మతు పనులను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం పరిశీలించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, బాన్సువాడ: Kalki Cheruvu Repairs | పట్టణంలోని కల్కి చెరువు బుంగ మరమ్మతు పనులను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఆగ్రోస్ ఇండస్ట్రీస్​ ఛైర్మన్ కాసుల బాలరాజ్‌తో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు.

Kalki Cheruvu Repairs | నాణ్యతలో తేడా రావొద్దు..

ఎమ్మెల్యే పోచారం (MLA Pocharam) మాట్లాడుతూ.. కల్కి చెరువు బుంగ మరమ్మతు పనుల కోసం ప్రభుత్వం రూ.27.60 లక్షలు మంజూరు చేసిందని తెలిపారు. పనుల్లో ఎలాంటి నాణ్యత లోపాలు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. భవిష్యత్​లో మళ్లీ సమస్యలు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేయాలని అధికారులకు సూచించారు. కల్కి చెరువు ద్వారా అనేక మంది రైతులకు సాగునీరు అందుతున్నందున మరమ్మతు పనులను వేగంగా పూర్తిచేసి నీటి వృథాను అరికట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ శ్రీచంద్, ఏఈ నితిన్, జంగం గంగాధర్, ఏజాస్, కృష్ణారెడ్డి, నార్ల సురేష్, బాబా తదితరులు పాల్గొన్నారు.

Kalki Cheruvu Repairs

ఇది కూడా చదవండి..: Pulse Polio Campaign | పోలియో రహిత సమాజం మనందరి లక్ష్యం..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *