అక్షరటుడే, ఎల్లారెడ్డి: SIR Enumeration Forms | ‘సర్’(SIR) ప్రక్రియకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు తిరిగి ఇవ్వడంలో ఓటర్లు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గడువు పొడిగించారులే.. చూద్దాంలే.. ఇద్దాంలే.. అని నిర్లక్ష్యం చేస్తున్నారు. తద్వారా స్థానిక బీఎల్వోలు.. ఆపై అధికారులపై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది.
SIR Enumeration Forms | కామారెడ్డి జిల్లాలో..
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కామారెడ్డి (Kamareddy Voters) జిల్లాలో కొనసాగుతోంది. ఎన్యుమరేషన్ ఫారాలను ఈ నెలాఖరులోగా బీఎల్వోలకు(BLO) ఫారాలు అందజేస్తేనే వాటిని నిర్ణీత సమయానికి ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి వీలుంటుందని ‘సర్’ అధికారులు పేర్కొంటున్నారు. గడువు ముగిస్తే ఆన్‌లైన్ నమోదుకు కేవలం 3 రోజులే సమయం మిగులుతుందని, కాబట్టి ఓటర్లు తక్షణమే స్పందించి పూర్తి చేసిన ఫారాలను అందజేయాలని జిల్లా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
SIR Enumeration Forms | జిల్లాలో 85.54శాతం డిజిటలైజేషన్ పూర్తి
ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రతిరోజు సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 85.54శాతం నమోదు ప్రక్రియ పూర్తవ్వగా, ఇంకా 14.46 శాతం డిజిటలైజేషన్ పూర్తి కావాల్సి ఉంది. జిల్లాలోని మొత్తం 796 బూత్‌లకు గాను 400 కంటే ఎక్కువ బూత్‌లలో 100శాతం ప్రక్రియ పూర్తయింది.
SIR Enumeration Forms | సమయం తక్కువగా ఉన్నందున..
బీఎల్వోలు మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణ పరిధిలోని పలువురు ఓటర్లు తమ సొంత గ్రామాల్లో సర్ ఫారాలు అందించడం వల్ల ఇక్కడ నమోదు శాతం కాస్త తక్కువగా నమోదైందని పేర్కొంటున్నారు. అయితే సమయం తక్కువగా ఉన్నందున నింపిన ఫారాలను వెంటనే స్థానిక బీఎల్వోలకు అందజేయాలని సూచిస్తున్నారు. కొన్నిప్రాంతాల్లో బీఎల్వోలు సైతం ఇంటింటికీ తిరుగుతున్నారని వారికి ఫారాలు ఇచ్చినా సరిపోతుందని పేర్కొంటున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వకుంటే ఓటు హక్కు గల్లంతయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ఫారం ఇవ్వకుంటే ఓటు గల్లంతయితే తర్వాతి ప్రక్రియ వరకు వేచి ఉండవద్దని సలహా ఇస్తున్నారు.
కామారెడ్డి జిల్లా సమగ్ర గణాంకాలు:
మొత్తం బూత్‌లు: 796
మొత్తం ఓటర్లు: 6,96,006
డిజిటల్ అయిన ఓట్లు: 5,95,366
100శాతం పూర్తయిన బూత్‌లు: 400 పైగా..
నియోజకవర్గాల వారీగా పురోగతి వివరాలు
ఎల్లారెడ్డి నియోజకవర్గం–88.98 శాతం
కామారెడ్డి నియోజకవర్గం–80.21 శాతం
జుక్కల్ నియోజకవర్గం–88.43 శాతం
ఇది కూడా చదవండి: పాకిస్తాన్‌పై కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫైర్