TGEJAC Employee Demands | ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలి: టీజీఈజేఏసీ

ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని టీజీఈజేఏసీ జిల్లా ఛైర్మన్​, టీఎన్జీవోస్​ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్​ కుమార్​ పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: TGEJAC Employee Demands | ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని టీజీఈజేఏసీ జిల్లా ఛైర్మన్​, టీఎన్జీవోస్​ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్​ కుమార్​ పేర్కొన్నారు. ఈ మేరకు నగరంలోని (Nizamabad) ధర్నాచౌక్​లో భారీ ఎత్తున తెలంగాణ ఎంప్లాయీస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్ అండ్​ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (TGE-JAC) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

TGEJAC Employee Demands |ఈహెచ్​ఎస్​ అమలులో నిర్లక్ష్యమెందుకు..

ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) అమలులో అలసత్వం ఎందుకు వహిస్తున్నారని సుమన్​ ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం తక్షణమే సానుకూల నిర్ణయాలు తీసుకోవాలి 2వ పే రివిజన్ కమిటీ నివేదిక అమలు, ఆరు పెండింగ్ డీఏల విడుదల, CPS రద్దు చేసి ఓపీఎస్​ అమలు, ఈహెచ్​ఎస్​ను పటిష్టంగా అమలు చేయాలని ఆయన డిమాండ్​ చేశారు. ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్య సేవలు, ఆరోగ్య కార్డుల వినియోగం, చికిత్స అందుబాటు, ఎంపానెల్ చేసిన ఆస్పత్రుల్లో సేవలు, వైద్య బిల్లుల పరిష్కారం తదితర అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.

TGEJAC Employee Demands | రెండో పీఆర్​సీ అమలు చేయాలి..

గత మూడేళ్లుగా ఎదురుచూస్తున్న 2వ పే రివిజన్ కమిటీ (2nd PRC) నివేదికను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు. జూన్ 2 లోపు పీఆర్​సీ నివేదికను కమిటీ నుండి తెప్పించుకొంటామనే సీఎం ఇచ్చిన హామీ అమలు కాలేదన్నారు. పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, జీవన వ్యయం, కుటుంబ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులకు తగిన వేతన సవరణ కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ధర్నాలో తెలంగాణ ఎంప్లాయీస్, గెజిటెడ్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్ అండ్​ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: AP Drought Crisis | రాష్ట్రంలో కరువు ఉన్నా సీఎం స్పందించడం లేదు : వైఎస్​ జగన్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *